జూలై 15న ధన్ రాజ్ ‘పనిలేని పులిరాజు’ 

ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పనిలేని పులిరాజు’. పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై చాచా దర్శకత్వంలో పి.వి.నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం జూలై 15న విడుదలవుతుంది.  ఈ సందర్భంగా …
నిర్మాత పి.వి. నాగేష్ కుమార్ మాట్లాడుతూ ’ ఇటీవల విడుదలైన మా పనిలేని పులిరాజు చిత్రంలోని పాటలకు మంచి ఆదరణ లభిస్తుంది. అలాగే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 15న విడుదలకు సిద్ధమైంది.  ధనరాజ్ కు మరో డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది. ఆరుగురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ధ‌నరాజ్ ప‌ద‌మూడు పాత్ర‌ల్లోన‌టిస్తున్నారు. అలాగే ర‌ఘ‌బాబు గ‌తంలో న‌టించిన బ‌న్ని సినిమా క్యారెక్ట‌ర్ ఈ చిత్రంలో కంటిన్యూ అవుతుంది. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ అందరికీ నచ్చుతుంది.’’ అని అన్నారు.
సహ నిర్మాత రవి.కె.పున్నం మాట్లాడుతూ ‘’ప్రస్తుతం మోషన్ పోస్టర్ విత్ డైలాగ్స్ కు మంచి ఆదరణ వచ్చింది. అలాగే పాటలకు, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. చిత్రాన్ని జూలై 15న విడుదల చేస్తున్నాం’’అన్నారు.
ప్రాచిసిన్హా, శ్వేతావర్మ, ఇషా, హరిణి,రఘుబాబు, కొండవలస, కోటేశ్వరరావు, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ మరుకుర్తి,సంగీతం: వి.వి. సహ నిర్మాత: రవి.కె.పున్నం, సమర్పణ: పి. లక్షి, నిర్మాత: పి.వి. నాగేష్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: చాచా.
To Top

Send this to a friend