జూలై 15న అల్లరి నరేష్ ‘సెల్ఫీ రాజా’

అల్ల‌రి న‌రేష్ తన కామెడితో ప్రేక్షకులను కితకితలు పెట్టిండానికి మరోసారి సిద్ధమవుతున్నారు.  ఈ తరం హీరోల్లో తనదైన కామెడితో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్ తో గతంలో సిద్ధు  ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుంక‌ర రామ‌బ్ర‌హ్మం స‌మ‌ర్ప‌ణ‌లో  ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్, గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై రూపొందుతున్న హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ ‘సెల్ఫీరాజా’. చ‌ల‌సాని రామ‌బ్ర‌హ్మం చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాక్షిచౌదరి, కామ్నా రనవత్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 15న గ్రాండ్ లెవల్లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా…

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “సినిమా టైటిల్ నుండి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో సెల్ఫీ మేనియాక్ గా అల్లరి నరేష్ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లరి నరేష్ నుండి ఎలాంటి కామెడి కావాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి కామెడితో నరేష్ నవ్వించడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు యూత్ లో ఉన్న సెల్ఫీ ట్రెండ్ తో నరేష్ ఎలాంటి కామెడి చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాను జూలై 15న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నాం“ అన్నారు.

To Top

Send this to a friend