అల్లరి నరేష్ హీరోగా సుంకర రామబ్రహ్మం సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్, గోపీ ఆర్ట్స్ బ్యానర్స్ పై సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఫేమ్ జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘సెల్ఫీరాజా’. చలసాని రామబ్రహ్మం చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సెల్ఫీ మానియక్ గా అల్లరి నరేష్ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. సాక్షిచౌదరి, కామ్నా రనవత్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలను త్వరలో విడుదల చేసి సినిమాను జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
