జియో సంచలనం.. అందుబాటులోకి స్మార్ట్ ఫోన్

రిలయన్స్ జియో సంచలనం సృష్టించింది.. ఉచిత 4జీ సేవలను అందించి ఇప్పటికే మిగతా టెలికాం ఆపరేటర్లకు షాక్ ఇచ్చిన రిలయన్స్ ఇప్పుడు మరో పిడుగు వేసింది.. 4జీని మార్చి వరకు పొడిగించి ఇంకా చాలామందిని చేర్చుకుంటున్న రిలయన్స్ ఇప్పుడు తక్కువ ధరకు 4జీ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. కేవలం రూ.999, రూ.1499 రూపాయలకే 4జీ స్మార్ట్ ఫోన్ తెస్తున్నట్టు ప్రకటించింది.. ఈ ఫోన్లతో మార్కెట్లోకి వస్తే స్మార్ట్ ఫోన్ల కంపెనీలకు, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ ఆపరేటర్లకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.. ఫీచర్ ఫోన్లు వాడుతున్న వారందరూ ఈ చవకైనా 4జీ ఫోన్లకే మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. తద్వారా మార్కెట్లో జియో అతిపెద్ద ఆపరేటర్ గా మారే అవకాశాలు మెండు..

కాగా ఈ తక్కువ ధర 4జీ ఫోన్లకు మంచి ఫీచర్సేనే ఏర్పాటు చేస్తోందట జియో.. ఈ ఫోన్లలో ముందు వెనుక కెమరాలతో పాటు జియో చాట్, లైవ్ టీవీ, వీడియో ఆన్ డిమాండ్ వంటి ఆప్ లు కూడా ఉంటాయని సమాచారం. ఇందులో ఆర్జీయోకు సంబంధించిన జియో మనీ వాలెట్ ను కూడా వాడుకునేలా ఫోన్లు తీసుకువస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో 4జీ ఎల్ టీఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 3500-4000 స్థాయిలో ఉంది.. రిలయన్స్ గనుక త్వరగా చీప్ ఫోన్ విడుదల చేస్తే మార్కెట్ షేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది..

To Top

Send this to a friend