జియో ఫ్రీ ఇస్తే.. ఎవరికీ లాభం..?


జియో.. జియో.. దేశాన్ని డిజిటైలేషన్ చేయాలనుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ కలలను సాకారం చేసే దిశగా ఆయన సన్నిహితుడు.. గుజరాతీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భారీ ముందడుగు వేశాడు. ఇప్పటికే జియో దెబ్బకు కుదేలవుతున్న ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్లు కస్టమర్లకు తక్కువకు వివిధ ప్లాన్లను అందిస్తున్నాయి. జియో దెబ్బకు దేశంలో ఏకంగా రెండు మూడు స్థానాల్లో ఉన్న ఐడియా, వోడాఫోన్ లు ఏకం అయ్యేందుకు డిసైడ్ అయ్యాయి. ఇంతకీ ఇంతలా ఉచితంగా డేటా సేవలు అందిస్తున్న ముఖేష్ అంబానీకి ఏం మిగులుతుంది.. లేక దేశం కోసం ప్రజల కోసం ముఖేష్ తన ఆస్తులను ఫణంగా పెట్టి దేశాన్ని డిజిటలైజ్ చేసేందుకు ఉచిత హామీలు ఇస్తున్నారా..? మరి ఎందుకు ఇంత ఫ్రీగా ఇస్తూ డబ్బులు వృథా చేసుకుంటున్నాడు..? ఇది ప్రతి ఒక్క జియో కస్టమర్, దేశప్రజలను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న..?

ఏ వ్యాపారి తాను ప్రారంభించిన వ్యాపారంలో నష్టాలు కోరుకోడు.. అదీ దేశంలోనే వేలకోట్ల సామ్రాజ్యాన్ని నడుపుతూ నంబర్ 1 కుబేరుడుగా పేరుపొందిన ముఖేష్ అంబానీ అయితే నష్టాలు వచ్చే ఏ పరిశ్రమను స్థాపించడు.. నష్టపోయేలా చేయడు.. మరి జియో ద్వారా ఎందుకు ఇంత ఫ్రీగా దేశ ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నాడనే కదా డౌట్.. అందులోనే లాజిక్ ఉంది..

టెలికాం రంగంలోకి వచ్చిన కొత్త జియోకు కానీ ఏ ఇతర ఆపరేటర్ కు కానీ కావాల్సంది మొదట కస్టమర్లు.. ఆ నెట్ వర్క్ వాడే వినియోగదారులు ఉంటేనే కదా.. రిచార్ట్ చేసుకునేది.. డేటా వాడేది.. కంపెనీకి డబ్బులు వచ్చేది.. అందుకే ముఖేష్ మొదట జియోను లాంచ్ చేయడానికి ముందే అతిపెద్ద ప్లాన్ చేశారు. అంతా ఫ్రీ ఇచ్చేశారు. దీంతో ఇప్పటికే సెకనుకు 7 చొప్పున చేరుతూ జియోతో 10 కోట్ల మంది కస్టమర్లు చేరారు. ఇది ఫేస్ బుక్, వాట్సాప్ సంస్థలతో పాటు ప్రపంచంలోనే 170 రోజుల్లో ఇంతమంది కంపెనీలో కస్టమర్లుగా చేరడం వరల్డ్ రికార్డు.. కస్టమర్లకు ఫ్రీ ఇస్తూ ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ నుంచి లాక్కుంటున్నారు. చివరకు సంవత్సరం తర్వాత దేశ కస్టమర్లందరూ జియోకు మారితే మిగతా టెలికాం ఆపరేటర్లు అడుక్కు తినాల్సిందే..

ఈ 100 కోట్ల మంది సెల్ ఫోన్ లో జియో వాడితే ముఖేష్ అంబానీ రిలయన్స్ కు ఎంత ఆదాయమో ఒక్కసారి ఆలోచించండి.. ఇప్పుడు ఫ్రీ ఇచ్చి అప్పటికీ మోస్తరు రేట్లు పెట్టినా కానీ ఒక్కరోజు 100 కోట్ల మంది చేసే ఖర్చు.. కొన్ని వేల కోట్ల ఖర్చు.. అంటే ముఖేష్ అంబానీకి రోజుకే కొన్ని వేల కోట్ల ఆదాయం.. అంత భారీ ప్లాన్ ఉంది కాబట్టే. ఇప్పుడు అంతా ఫ్రీ అంటూ వినియోగదారులను చేర్చుకుంటూ తరువాత టారిఫ్ ప్లాన్ లు పెట్టి కోట్ల కొల్లగొట్టే ముఖేష్ అంబానీ ఐడియా అదుర్స్ కదూ.. అందుకే బిజినెస్ మైండ్ బిజినెస్ మైండే.. ముఖేష్ అంబానీ అందుకే దేశంలోనే అపరకుబేరుడు నంబర్ 1 స్థానం దక్కించుకుంది ఇందుకే..

To Top

Send this to a friend