జియోతో ఫైటింగ్.. దెబ్బకు కుదేలవుతున్న ఎయిర్ టెల్ , ఐడియాలు

reliancejio-airtel-idea-vodafone

దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చాలన్న ప్రధాని సంకల్పానికి తగ్గట్టుగానె ఆన్నట్లు దేశంలోనే ధనవంతుడైన ముఖేష్ అంబానీ జియో పేరుతో టెలికాం పరిశ్రమను ప్రారంభించారు. ప్రారంభంతోనే కాల్స్, ఇంటర్ నెట్, ఎస్ఎమ్మెస్ అన్నీ ఫ్రీ ఇచ్చి అదీ 4జీ స్పీడుతో అందించడంతో దేశవ్యాప్తంగా జనాలు ఎగబడ్డారు. అందరూ 4జీ జియోలనే వాడుతున్నారు. జియో దెబ్బకు కుదేలవుతున్న ఎయిర్ టెల్ , ఐడియాలు తప్పనిసరి పరిస్థితుల్లో టాక్ టైం, డేటా సేవలను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు జియో నుంచి వచ్చే కాల్స్ ను బ్యాన్ చేశాయి. దీనిపై జియో ట్రాయ్ కు ఫిర్యాదు చేయడంపై వివాదం నడస్తున్న సంగతి తెలిసిందే..
కాగా ఇప్పుడు న్యూఇయర్ ఆఫర్ పేరుతో మరో 3 నెలలు ఫ్రీ ఇచ్చిన ముఖేష్ అంబానీ ధాటికి ఇతర టెలికాం కంపెనీలు బెంబేలెత్తి కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ కి ఫిర్యాదు చేశాయి. కాగా ఇన్నాళ్లు ఏకచత్రాధిపత్యంగా దేశ టెలికాం రంగాన్ని సిండికేట్ అయ్యి ఏలిన ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర సర్వీసులకు జియో తో ముఖేష్ అంబానీ షాక్ ఇచ్చాడు. సామాన్యుల చెంతకు ఉచిత కాల్స్, ఇంటర్ నెట్ తెచ్చాడు. ఇది దేశప్రజలకు ఉపయోగపడే విషయం. కానీ తద్వారా తమ ఆదాయం కోల్పోతున్నామని కుంటిసాకులు వెతికి ఫిర్యాదులు చేస్తున్న ఎయిర్ టెల్, ఐడియా జియో బాటలో నడిస్తే పరిస్తితి బాగుపడుతుంది. లేదంటే.. కష్టమర్లందరూ ఖాళీ అయ్యి వారి దుకాణం బంద్ అవుతుందేమొ!

To Top

Send this to a friend