జాహ్నవి ఫిలింస్ బ్యానర్ లో అల్లరి నరేష్

మలయాళం లో ఘన విజయం సాధించిన ‘ఓరు వడక్కన్‌ సెల్ఫీ’ చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్‌ కాబోతుంది. జాహ్నవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్‌ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ‘ఓరు వడక్కన్‌ సెల్ఫీ’ మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన జి. ప్రజీత్‌ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠతను కొలిపే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ నెల (మార్చి) 16 నుండి ఏప్రిల్‌ 5 వరకు పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 16 నుండి తదుపరి షూటింగ్‌ మొత్తం హైద్రాబాద్‌లో జరుపుకోనుంది. నిఖిల విమల్‌ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రలో నటించనున్నారు.
అల్లరి నరేష్‌, నిఖిల విమల్‌, అవసరాల శ్రీనివాస్‌, హైపర్‌ ఆది, జయప్రకాశ్‌, జీవా, పద్మా జయంతి, తులసి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఉన్ని.ఎస్‌. కుమార్‌, ఎడిటర్‌: నందమూరి హరి, మ్యూజిక్‌: డి.జె.వసంత్‌, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, డైలాగ్స్: పిల్ల జమీందార్ అశోక్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎమ్‌.ఎస్‌. కుమార్‌, సమర్పణ: శ్రీమతి నీలిమ, ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ బొప్పన, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి. ప్రజీత్‌.

To Top

Send this to a friend