జానీ ప్లాప్ కు కారణం అదే


‘పవన్ నటించిన సినిమాల్లో దేన్ని రిమేక్ చేయాలనుకుంటున్నారు’ అని పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ని ప్రశ్నిస్తే ఆమె ఠక్కున చెప్పిన సమాధానం జానీ సినిమా. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే పెద్ద ప్లాప్. పైగా ఈ సినిమాకు పవన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ రేణూ దేశాయ్. అందుకే ఈ సినిమా ప్లాప్ తనను కలిచివేసిందని.. దీన్నే రిమేక్ చేస్తానని చెప్పుకొచ్చింది.

జానీ ప్లాప్ కు గల కారణాలను రేణూ వివరించింది. జానీ కథ ప్రకారం తీస్తే భారీ హిట్ అయ్యేదన్నారు. కానీ కథను కమర్షియల్ పంథాలో తీయడం వల్లే ప్లాపు అయ్యిందన్నారు. వాణిజ్య హంగుల కోసం ఒరిజినల్ కథలో మార్పులు చేయడం వల్ల కథనం దెబ్బతిందన్నారు. అసలైన కథ ప్రకారం క్లైమాక్స్ లో హీరో పాత్ర చనిపోవాలట.. కానీ పవన్ లాంటి స్టార్ హీరో చనిపోతే సినిమా విజయవంతం కాదేమోనని.. కథలో లేని చాలా మార్పులు చేశారట.. ఇలా తెరకెక్కించడంతో సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. భవిష్యత్తులో ఎప్పటికైనా ఒరిజినల్ కథతో జానీ సినిమా రిమేక్ చేస్తానని స్పష్టం చేసింది రేణూ..

To Top

Send this to a friend