జస్ట్ ఫాలో కేటీఆర్

ఏపీ కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు.. అయితే కొందరికి ప్రమోషన్.. కొందరికి డిమోషన్ ఇచ్చారు . అందరి శాఖలు ఎలా ఉన్నా.. లోకేష్ బాబుకు ఏ శాఖ ఇస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ ఉంది. కానీ చంద్రబాబు ఏమాత్రం రిస్క్ తీసుకోలేదు.. జస్ట్ కేటీఆర్ ను ఫాలో కమ్మని తన కొడుకు లోకేష్ బాబుకు చంద్రబాబు సూచించినట్టు అయ్యింది. ఎందుకంటే కేటీఆర్ తెలంగాణలో నిర్వహించిన శాఖలనే చంద్రబాబు ఏపీలో లోకేష్ బాబు కు కేటాయించారు.

కొద్దికాలంగా కేటీఆర్-లోకేష్ ల మధ్య పోటాపోటీ నెలకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే కేటీఆర్ ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దారు. జీహెచ్ఎంసీ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతలు అప్పగించగా కేటీఆర్ తండ్రి కి తగ్గ తనయుడిగా విజయబావుటా ఎగురవేశారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు కూడా కేటీఆరే నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అనధికారికంగా నంబర్ 2 స్థానాన్ని కేటీఆర్ ఆక్రమించారు. పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్ ఏం చెప్తే అదే జరుగుతోంది. కేసీఆర్ అనారోగ్యం కూడా కేటీఆర్ ను ప్రొజెక్టు చేయడానికి కారణమైంది.

కానీ ఏపీలో పరిస్థితి వేరు.. ఏపీలోని నాయకులు చంద్రబాబుకు కూడా భయపడే పరిస్థితి లో లేరు.. పార్టీపై చంద్రబాబు పట్టు జారిపోతోంది. ప్రభుత్వంపై కూడా కేసీఆర్ లా పవర్ చేజిక్కించుకోలేకపోయారు. అందుకే మంత్రివర్గ విస్తరణ జరగగానే కొందరు సీనియర్లు రాజీనామాలకు సిద్ధపడ్డారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఏకతాటిపైకి తేవడం చంద్రబాబుకే కష్టమవుతుంది. ఇక కొడుకు లోకేష్ కు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందోననే భయం చంద్రబాబులో ఉంది. ఎందుకంటే చంద్రబాబుకంటే సీనియర్లు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. వారి ముందు లోకేష్ పిల్లాడే.. దీంతో లోకేష్ ను ఎవ్వరూ వినే పరిస్థితి లేదు.. అందుకే చంద్రబాబే నెట్టుకొస్తున్నారు. ఎట్టకేలకు పార్టీ నేతలు, లోకేష్ నుంచి ఒత్తిడికి తలొగ్గి మంత్రిని చేశారు. పట్టున్న ఐటీ,పంచాయతీరాజ్ లను కేటాయించారు. కేటీఆర్ ను ఫాలో అవమని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.

To Top

Send this to a friend