జల్లికట్టు .. తమిళుల ఉడుoపట్టు..

తమిళుల ఐక్యతకు కేంద్రం, సుప్రీం దిగొచ్చాయి..
తమిళులు.. ఎంతో స్వాభిమానం కలవారు.. వారికి భాషాభిమానం.. ప్రాంతీయవాదం ఎక్కువ.. అందుకే ఇప్పటికీ అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా.. బీజేపీ, కాంగ్రెస్ లకు చోటే ఉండదు.. దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలైన జయలలిత అన్నాడీఎంకే, కరుణానిధి డీఎంకేలకే తమిళులు పట్టం కడుతుంటారు.. తమిళ ఎంపీలు, ప్రజలు తాము కోరుకున్నది సాధించేదాకా వదిలిపెట్టారు. అందుకే తమిళనాడుకు నిధులు, విధుల్లో కేంద్రంలో అగ్రతాంబూళం దక్కుతుంది. ఎంపీలందరూ ఐకమత్యంగా ఉండి.. తమిళనాడుకు సాధించుకుంటారు. పార్లమెంటులో కూడా వారిదే ఆదిపత్యం..

ఇప్పుడూ తమిళలు మళ్లీ ఐక్యంగా పోరుబాట పట్టారు. సంక్రాంతి పండుగైన పొంగల్ నాడు తమిళనాడులో ఈనెలాఖరు వరకు జల్లికట్టు అనే ఆటను ఆడతారు.. గిత్తెలు (ఎద్దుల)తో పోటీపడి పరిగెడుతూ వాటిని లొంగదీసుకోవడమే జల్లి కట్టు ఆట.. ఈ ఆటపై కొందరు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆ ఆటపై నిషేధం విధించాలని సుప్రీం నిర్ణయించింది. కానీ ఈనిర్ణయం వెలువడకముందే తమిళనాడు భగ్గుమంది. విద్యార్థులు, నాయకులు, సినీ, రాజకీయ నాయకులందరూ ఏకమై తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చారు. ఈరోజు చైన్నై మెరీనా బీచ్ లో వందలాది మంది వచ్చి జల్లికట్టు ఆటను నిషేధించవద్దంటూ ఆందోళన చేస్తున్నారు. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ప్రధానిని కలిసి జల్లికట్టు ఆట తమిళుల ఆరాధ్య ఆటని.. దాన్ని నిషేధం బారినుంచి తప్పించి ఆర్డినెన్స్ ద్వారా ఆడే అవకాశం కల్పించాలని కోరారు. దీంతో మోడీ, కేంద్రం స్పందించి జల్లికట్టు నిషేధం తీర్పును వారంపాటు వాయిదా వేయాలని.. శాంతి భద్రతలు అదుపుతప్పుతాయని సుప్రీం కోర్టును కోరారు. దీంతో సుప్రీం ప్రస్తుతం తీర్పును వాయిదా వేసింది.. ఇలా తమిళులు పట్టిన పట్టుకు కేంద్రం, సుప్రీం దిగొచ్చాయి. సంప్రదాయ ఆటపై నిషేధం పడకుండా తమిళులు ఐక్యతతో విజయం సాధించారు.

To Top

Send this to a friend