జల్లికట్టు కాదు.. గొడ్డు మాంసం నిషేధించండి : పవన్

ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాడు. కేంద్ర ప్రభుత్వం వైఖరి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నట్లు ఉందని ధ్వజమెత్తారు. ఈ రోజు ట్విట్టర్ ద్వారా స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నిషేధం బాటలో ఉన్న జల్లికట్టు, కోడిపందేలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

జల్లికట్టుపై నిషేధం.. దవ్రిడ సంస్కృతి, సమగ్రతపై దాడిగా పవన్ పేర్కొన్నారు. దక్షిణ భారతంపై కేంద్ర వైఖరికి ఇది నిదర్శనమని అన్నారు. సంస్కృతి , పశువులు, మాతృభూమిపై తనకు గౌరవముందని.. కేంద్రం మాత్రం వీటిని వివాదాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. గోవామృతంతో తాను వ్యవసాయం చేస్తున్నానని.. తన గోశాలలో 16 ఆవులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. జల్లికట్టుపై నిషేధాన్ని విధించాలనుకుంటే.. ముందు గొడ్డు మాంసం విక్రయాలను నిషేధించాలని కేంద్రం డిమాండ్ చేశారు. ప్రజల సంస్కృతిలపై దెబ్బకొట్టే కేంద్ర చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పవన్ ట్విట్టర్ ప్రకటన విడుదల చేశారు.

To Top

Send this to a friend