‘జల్లికట్టు’.. ఆంధ్రులకు, నాయకులకు ఓ గుణపాఠం: పవన్

జల్లికట్టు ఉద్యమం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. తమిళులు ఐక్యమత్యంగా.. సంఘటితంగా.. ఏకమై.. అహింసా పద్ధతిలో జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. దీనికోసం తమిళనాడు వ్యాప్తంగా శాంతియుత ఆందోళన చేస్తారు. ఈ ఆందోళన హిందూ వ్యతిరేక ఉద్యమంలా మారకముందే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జల్లికట్టుకు చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసేందుకు రెడీ అయ్యింది.. ఇదో ప్రజల విజయం.. ఈ విజయం మున్ముందు సాగే అన్ని ఉద్యమాలకు ఒక గుణపాఠం..

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఇదే చెప్పారు.. జల్లికట్టుపై కేంద్రం విజ్ఞత ప్రదర్శించి దేశసమగ్రతకు భంగం కలగకుండా మంచి నిర్ణయం తీసుకుందని.. ఇది తమిళుల విజయమని పునరుద్ఘాటించారు.ఇలానే భారత సంస్కృతి సంప్రాదాయాల వైవిద్యాన్ని గౌరివించాలని.. లేకపోతే మున్ముందు ఇటువంటి ఆందోళనలు తలెత్తే ప్రమాదం ఉందని పవన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. కులమతాలకు అతీతంగా తమిళులంతా ఏకమై జల్లికట్టుకు వ్యతిరేకంగా నినదించడం స్పూర్తిదాయకమని పవన్ ప్రశంసించారు. జల్లికట్టుకు వ్యతిరేకంగా లక్షల మంది చైన్నై మెరీనా బీచ్ లో అసాంఘిక సంఘటనలకు పాల్పడకుండా ఉండడం హర్షిందగ్గ విషయమన్నారు. తమిళుల సంఘటిత శక్తి, అహింసాయుతమైన పద్ధతి తనను కదిలించాయని పవన్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. తమిళులు వారి సంస్కృతిని కాపాడుకుంటున్నట్టు గానే మిగతా అందరూ అలానే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రుల వైఖరి, రాజకీయ నేతలు తమిళుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పవన్ చురకలంటిచారు. మన రాజకీయ నేతలు కూడా ఇటువంటి సంఘీభావాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నానని తెలిపారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ‘ఏపీ ప్రత్యేక హోదా’ సాధించాలని సందేశమిచ్చారు.. వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉన్న ఏపీ రాజకీయ నేతలు తమిళ ఉద్యమ నుంచి స్ఫూర్తి పొందాలని .. కానీ వారు ఆ పనిచేయరని తనకు సందేహాలున్నాయన్నారు. అయితే ఈ విషయంలో రాజకీయ నేతలు రాజీపడినా ప్రజలు మాత్రం రాజీపడబోరన్న గట్టి నమ్మకం నాకు ఉందని పవన్ తెలిపారు.

To Top

Send this to a friend