జర్నలిస్టులకు గుడ్ న్యూస్….

జర్నలిస్ట్ లకు…ప్రభుత్వ వేతనాలు…వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్.

నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టు సంక్షేమం కొరకు సంచాలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు.సచివాలయంలో మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహించి వరుసగా ఐదేళ్ళు అక్రిడేషన్ తీసుకుని లేదా పదేళ్ళు అక్రిడేషన్ లేకుండా ( తహసిల్ధార్ సిపార్సు)తో జర్నలిస్ట్ సోదరులకు 5000రుపాయలు వేతనంతో పాటు ఉద్యోగ బధ్రత కల్పిస్తూ నిర్ణయం. అలాగే 60లు నిండిన వృద్ద జర్నలిస్ట్ లకు 4000లు పింఛన్ మంజూరు. వీరి ఎంపిక ప్రక్రియ స్థానిక ఎమ్మేల్యేతో పాటు డిపిఆర్ఓ లతో కూడిన 5మంది సభ్యుల కమిటీలు ఏర్పాటు. రాజకీయాలకు అతీతంగా ఎంపికలు. వచ్చే ఏప్రిల్ మాసాంతానికి అర్హుల జాబితాలు సిద్దం చేసి సమాచార శాఖకు పంఫాలి. దీనికి తోడు అందరికి ఉద్యోగస్తుల మాదిరిగా అన్ని సౌకర్యాలు. రిటైర్మెంట్ 60 ఏళ్ళు మాత్రమే. మరీ ముఖ్యంగా జర్నలిస్టుల పనితీరు అవినీతి పై ఉద్యోగుల వలే ఏసిబి పరిధిలో పెట్టనున్నారు. అంతేకాకుండా జర్నలిస్ట్ ఎంపికలో సంస్థలకు లేకుండా సమాచార శాఖ ద్వారా నియామకం. అక్రిడేషన్ల దుర్వినియోగం అమ్మకాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మరీ ముఖ్యంగా విలేఖరులకు అర్హత పరీక్షను తెలుగు బాష పై పట్టు జికే తదితర అంశాలపై ఉండనుంది. ఒక్కసారిగా కేసీఆర్ జర్నలిస్ట్ లకు వరాల జల్లు కురిపించడంతో అక్కడున్న సినీయర్ జర్నలిస్ట్ లు ఒక్కసారిగా తీవ్ర ఉద్వేగాని లోనయ్యారు. అయితే యాజమాన్యాలు ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. మాకు రెవెన్యూ పెరిగేలా చర్యలు తీసుకోవాలని…వరాల్లో ప్రధానం వేతనాలు తమ అకౌంట్ లో వేయాలని లేదంటే యాడ్స్ రెవెన్యూ తగ్గిపోతుందని సిఎం వద్ద ప్రస్తావించగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. దీంతో వరాలు ప్రకటించడం వెనుక అసలు విషయం ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యిందీ. అర్హులంతా నిబంధనల మేరకు తమతమ వివరాలను స్థానిక ఎమ్మేల్యే కు అందజేయగలరు. ……
—–/////////

-.
….
ఇదంతా నిజమానుకున్నారా ఏప్రిల్ ఫుల్

To Top

Send this to a friend