జయలలిత సగౌరవంగానే ఈ లోకం నుంచి వెళ్లిపోయిందా..? లేదు!!!

amma

ఆమె వెళ్లిపోయింది… కానీ రాష్ట్రాన్ని ఓ నియంతలా శాసించిన జయలలిత, అందరూ అనుకుంటున్నట్టు సగౌరవంగానే ఈ లోకం నుంచి వెళ్లిపోయిందా..? లేదు… బయటికి ఇక ఎప్పుడూ వెలుగుచూడని ఎన్నో చీకటికోణాలు… దయనీయమైన స్థితి..,. ఆమె చుట్టూ అల్లుకున్న రకరకాల ఎత్తుగడల్లో బందీ అయిపోయి, దాదాపు 3 నెలల నరకం తరువాత, ఇక ఈ లోకం నాకక్కర్లేదని వెళ్లిపోయింది… ఆమె మరణం వెనుక ఉన్న కుట్రలో, మిస్టరీలో ఇంకెప్పుడూ వీడవేమో… ఆమె శవపేటికకు కొట్టిన మేకులను తొలగించుకోలేక, ఆ రహస్యాలన్నీ ఆమెతోపాటే ఇక సమాధి అయిపోయినట్టేనేమో… పార్లమెంటులో అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప జయలలిత హాస్పిటల్ లో ఉన్నప్పుడే ఓ ప్లకార్డు ప్రదర్శించింది… ‘సేవ్ అమ్మ’… అదీ… ఆమె చుట్టూ ఏ శక్తులు చేరి, ఆమెను దూరం చేశాయి, చేస్తున్నాయి…? ఈ నిజాలు బయటపడాలనేది ఆమె కోరిక… నిజంగానే జయలలిత మరణం వెనుక అనేక ప్రశ్నలు… విస్తుపరిచే ప్రశ్నలు… జవాబులు దొరకని ప్రశ్నలు ఎన్నో… అంతఃపుర కుట్రలు, నమ్మకస్తుల వెన్నుపోట్లు, అంతుచిక్కని మరణాలకు పాత పాత రాజుల కథలేమీ చదవనక్కర్లేదు… తాజా తాజా జయలలిత కథ కూడా అలాంటిదేనేమో… వరుసగా కొన్ని ప్రశ్నలు మనమే వేసుకుందాం… జవాబులు వెతుక్కుందాం… జవాబులు ఇక దొరకవు అనుకున్న ప్రశ్నల్ని ఓ క్రమపద్ధతిలో అర్థం చేసుకుని, జయలలిత మరణాన్ని తలుచుకుంటే చాలు… అప్రయత్నంగానే అశ్రుబిందువొక్కటి చెంపలపైకి జారి, ఆమెకు జాలిగా నివాళి అర్పిస్తుందేమో….

జయలలిత బెంగుళూరు జైలులో ఉన్నప్పటి నుంచే ఆమెపై స్లో పాయిజన్ వంటి కుట్రలు ఆరంభమయ్యాయనేది ఓ ఆరోపణ… ఆమె భోజనాన్ని రోజూ పరీక్షించి పంపించడం అనేది ఊహించలేం కాబట్టి జరిగే ఉండవచ్చు అనుకుందాం… కానీ ఆ అవసరం ఎవరికి ఉంది? ఎందుకు…? సరే, అదేమీ లేదు, అన్నీ ఊహాగానాలే అనుకుందామా..? సరే…
ఆమె బయటపడింది, నిలిచింది, గెలిచింది… అన్ని తప్పుడు అంచనాలనూ ఛేదించుకుని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యింది… అంతా శుభమే… కానీ మూడు నాలుగు నెలల క్రితం నుంచే ఆమె ఎందుకు బయటకు రావడం లేదు? ఇంపార్టెంట్ అనుకున్న ప్రోగ్రాములకు కూడా ఆమె రాలేదు… ఏమిటి ఆమె అనారోగ్యం…? కోట్ల మందికి కనీస సమాచారం లేదు..? ఎందుకు…? సరే, అనవసర ప్రచారాలకు తావివ్వవద్దనే భావనతో ఆమే వద్దని ఆదేశించిందీ అనుకుందాం… సరే…
ఆల్ రెడీ ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆమెను అకస్మాత్తుగా అపోలోలో ఎందుకు జాయిన్ చేశారు…? అంత సీరియస్ ఏమిటి…? అయితే కేవలం జ్వరం మాత్రమేననీ, రెండు రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తుందీ అన్నారు ఎందుకు…? సరే… దీనికి కూడా అనవసర ప్రచారాలు వద్దనే భావనే కారణం అనుకుందాం… సరే…
ఆమె హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులూ హెల్త్ బులెటిన్లు లేవు ఎందుకు..? రోజుకోరకం కాంప్లికేషన్స్ ఎందుకు చెప్పారు…? చిన్నాచితకా నాయకులు హాస్పిటల్ లో ఉంటేనే హెల్త్ బులెటిన్లు జారీ చేసే రోజులివి… అదెందుకు జరగలేదు…? సరే… ఆమే వద్దని చెప్పింది అనుకుందాం… సరే…
75 రోజులపాటు ఆమె హాస్పిటల్ లో ఉంటే ఒక్కరిని కూడా కలవనివ్వలేదు ఎందుకు…? చూడనివ్వలేదు ఎందుకు…? అప్పట్నుంచే ఆమె లైఫ్ సపోర్ట్ మీద ఉందా…? ఆమెను అభిమానించే కోట్ల మందికి ఒక్కరోజైనా సరైన సమాచారం ఎందుకు ఇవ్వలేదు…? ఆల్ ఆఫ్ సడెన్ ఆమె వేలిముద్రతో అభ్యర్థుల జాబితా వస్తుంది…? ఆమె సూచనల మేరకే అంటూ ముఖ్యమంత్రి చూసే విధులను అకస్మాత్తుగా పన్నీర్ సెల్వంకు ఎలా అప్పగించారు…? నిజంగా ఆమె అలా సూచించే స్థితిలోనే ఉన్నదా…? సరే, ఉన్నదేమో… ఆమే చెప్పిందేమో అనుకుందాం… సరే…
ఇన్నిరోజులపాటు ఏదో జరిగిపోయిందిలే అనుకుందాం… ఆమె మొత్తం కోలుకున్నదీ, తింటున్నదీ, పేపర్లు చదువుతున్నదీ, ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెళ్లిపోవచ్చు, కాకపోతే పూర్తిగా కోలుకోవటానికి ఇంకాస్త సమయం పట్టవచ్చునని హాస్పిటల్ వర్గాలు చెప్పాయి కదా… మరి నేను క్షేమంగానే ఉన్నాను అంటూ ఆమె మాట్లాడిన ఒక ఆడియో గానీ, ఒక వీడియో గానీ, ఆమెకు చికిత్స జరుగుతున్న ఫోటోలు గానీ, ఆమె కోలుకున్నట్టు ఒక్కటంటే ఒక్క సాక్ష్యమూ కనిపించలేదేం…? సరే… ఎలాగూ ఇంటికి వెళ్తున్నాను కదా, ఇక ఈ ఫార్మాలిటీస్ ఎందుకు అని ఆమే వద్దన్నది అనుకుందాం… సరే…
మళ్లీ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది ఎలా…? సరే… గుండెపోటును ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి వోకే అనుకుందాం… కనీసం ఆమె ఐసీయూలో ఉన్నప్పుడైనా ఆమె ఆరోగ్యంపై ఎందుకు గోప్యత పాటించారు…? అన్నిరకాల చికిత్సలూ ఇస్తున్నాం అన్నది కదా హాస్పిటల్… మరి ఎందుకు అంతగా పారామిలిటరీ బలగాలను, పోలీసులను మోహరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది…? గుండెపోటు రాగానే మరణించిందా…? ఎందుకు దాచిపెట్టారు…? చికిత్స ఇంకా చేస్తున్నారు కాబట్టి చెప్పలేదు అని మనమే జవాబు చెప్పుకుందాం… సరే…
హుటాహుటిన గవర్నర్ చెన్నయి వచ్చి, పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకున్నాడు… మరి ప్రకటించలేదేం…? సరే… తమిళప్రజలు ఆ షాక్, భావోద్వేగాలతో రెచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మెల్లిగా ప్రకటించాలని అనుకున్నారు అని సర్దిచెప్పుకుందాం… సరే… కానీ ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నది ఎవరు…? ఏ హోదాతో…? ఆ స్థితిలోనూ ఆమెను చూడటానికి ఎవరినీ ఎందుకు అనుమతించలేదు…? చివరకు ఆమె బంధువులు వస్తే కూడా ఎందుకు అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు ఎందుకు…? సరే, ముందు రాజకీయంగా అన్నీ చక్కదిద్దాక ప్రకటించాలి, మరణం లీక్ కావద్దు అనుకున్నారని మనమూ అనుకుందాం… సరే…
ఆమె రికవరీ అవుతున్నదని బయటికి చెబుతూనే… పార్టీ ఎమ్మెల్యేలు, కేబినెట్ సమావేశం కావడం ఏమిటి…? పార్టీ తరఫున ఈ నిర్ణయాలు తీసుకున్నది ఎవరు..? మొత్తం దీన్నంతా కంట్రోల్ చేసిందెవరు..? రాజకీయ అనిశ్చితి త్వరగా లేకుండా చేద్దామని పార్టీ ముఖ్యులే ఉమ్మడిగానే ఇలా వ్యవహరించారని అనుకుందాం… సరే…
రాత్రికిరాత్రి పార్టీ పదవులు, సీఎం, కొత్త కేబినెట్, వాళ్ల పోర్ట్ ఫోలియోలు సహా ఖరారైపోయాయి… ఎవరు ఇదంతా నియంత్రించింది…? పర్యవేక్షించింది… ఈలోపు జయ చానెలే ఆమె చనిపోయిందని వార్త ఇచ్చింది… జెండాను అవనతం చేశారు… మళ్లీ వెంటనే ఖండనలు, ఆమె మరణించలేదనీ, చికిత్స జరుగుతున్నదనీ హాస్పిటల్ వివరణ ఎందుకు..? ఎవరు ఇవ్వమన్నారు…? సరే… మళ్లీ గంటలోపే మరణించినట్టు అధికారిక ప్రకటన, అదీ హాస్పిటల్ నుంచి…? ఇదేమిటి…? సరే… హాస్పిటల్ మీద ఒత్తిడి ఉంది అనుకుందాం… సరే…
అంత అర్ధరాత్రి ప్రమాణాలు ఎందుకు..? గవర్నర్ ఉన్నాడు, ప్రభుత్వం ఉంది, కేంద్రం గమనిస్తున్నది… అంత యమర్జెంటుగా అర్ధరాత్రి ప్రమాణాలు అవసరమా…? ఆమె మరణశయ్యపై ఉండగానే, ఇవన్నీ జరిగిన తీరు ఆమెను అవమానించినట్టేనా…? ఎలాగూ పోయింది కదా అనే తేలికభావమా…? లేక ఒక్కరోజు ఆగినా ఇంకేమైనా బయటపడుతుందనో, జరుగుతుందనో సందేహించారా…? ఏమిటా సందేహాలు…? ఎందుకీ హడావుడి యాక్షన్…? వీటికిి గవర్నర్ కూడా ఎందుకు తలూపాడు…? సరే, వాళ్ల పార్టీ వాళ్లిష్టం… అని గవర్నర్ కలగజేసుకోలేదు అనుకుందాం… సరే…
ఆమె జైలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ, ఏడుపు ఆపుకోలేక మధ్యలో కళ్లు తుడుచుకున్న వీరవిధేయుడు ఈసారి మాత్రం అలా ఉద్వేగానికి ఎందుకు గురికాలేదు..? అమ్మ మరణించిన విషాదం ఆ మొహంలో అసలు కనిపించలేదేం…? సరే… నిబ్బరంగా ఉన్నాడు, ఆమె జైలులో ఉంది కాబట్టి అప్పుడు ఉద్వేగాన్ని కూడా ఓ విధేయత ప్రకటనలా చూపించాడు అనుకుందాం… ఈసారి ఆమే లేదు కాబట్టి ఇంకా ఆ ఉద్వేగ ప్రకటన అవసరం లేదని అనుకున్నాడేమో… అలా అనుకుందాం… సరే…
ఇన్ని సరే అనుకునే, సర్దిచెప్పుకునే సమాధానాల నడుమ వెంటవెంట ముప్పిరిగొనే అనేక సందేహాలు… ఎవరు ఆమె వెంటే ఉంటూ, ఆమెను బొమ్మను చేసి, ఆడించిన నటనసూత్రధారి ఎవరు…? శశికళా…? సెల్వమా…? కేంద్రమా…? అయితే ఇందులో కేంద్రం పాత్ర ఏంటి…? భవిష్యత్తు రాజకీయ కార్యాచరణకు సంబంధించి బీజేపీ అన్నాడీఎంకే ముఖ్యులతో ఏమైనా బేరాలాడిందా..? అయితే ఏమిటవి…? ఈ మొత్తం వ్యవహారంలో శశికళ పాత్ర ఏంటి… అన్నీ మౌనంగా చూస్తూ, మూగసాక్షులుగా మిగిలిపోయిన ఒక అపోలో ప్రతాపరెడ్డి, ఒక ప్రభుత్వ ప్రధాన సలహాదారు షీలా బాలకృష్ణన్, ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, ఒక డీజీపీ రాజేంద్రన్… ఇలా కొంతమందికి మొత్తం వ్యవహారాలపై అంచనా, అవగాహన ఉందేమో… కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడూ… ఎవరూ ఏమీ మాట్లాడరు… జయలలిత నిజానికి మూడు నెలల క్రితం నుంచే తన చేతుల్లో తను లేదు… నిమిత్తమాత్రంగా అలా బెడ్ మీద ఉండిపోయింది… చివరకు ఆ బెడ్ మీద నుంచి ఆమె స్థానం…. తన అభిమాన ఎంజీఆర్ సమాధి పక్కనే మరో సమాధిలోకి మారిపోయింది… అంతే

Thanks to Kotipalli Ayyappa Naidu

Source: Whatsapp message

To Top

Send this to a friend