జయలలిత, రజినీ, విశాల్, కార్తి తమిళులు కారు

జయలలిత మరణం అన్ని వర్గాల ప్రజల్లో విభేదాలకు కారణమైంది. అమ్మ ఉండగా కనీసం నోరు తెరవని వారందరూ నేడు బహిరంగంగానే అమ్మపైనే విమర్శలు చేస్తున్నారు. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అస్థిరతను బేస్ చేసుకొని మరింత అలజడి సృష్టిస్తున్నారు. జయలలిత ప్లేసులోకి రజినీకాంత్ రావాలని కొద్దికాలంగా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. దాన్ని దెబ్బకొట్టడమే ధ్యేయంగా నటి, దర్శకురాలు, నిర్మాత అయిన రాధిక సంచలన కామెంట్లు చేసింది. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో భర్త శరత్ కుమార్ తో కలిసి ఆమె వ్యాఖ్యలు చేసింది..

అసలు తమిళనాడులో స్థానికేతరులు ఎక్కువైపోయారని.. వారే అధికారం చెలాయిస్తున్నారని.. వారిని తమిళులు ఆదరించవద్దంటూ బాంబు పేల్చింది.. సీఎం జయలలిత(కర్ణాటక స్వస్థలం), రజినీకాంత్ (కర్ణాటక స్వస్థలం), సహా నటుడు విశాల్ (ఏపీ స్వస్థలం) , కార్తి(కేరళ)లు తమిళనాడుకు చెందిన వారు కారని.. వారికి అధికారం అప్పగించడం తప్పు అని రాధిక మండిపడ్డారు. విశాల్ గతంలో తమిళ సినీ కళాకారుల సంఘానికి పోటీ చేసి అప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న రాధిక భర్త శరత్ కుమార్ ను చిత్తుగా ఓడించాడు. ఆ కోపంతోనే విశాల్ పైనా.. పనిలో పనిగా రజినీ, జయలలిత స్థానికతను ప్రశ్నించి సొమ్ము చేసుకుంది రాధిక.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట దుమారాన్ని రేపాయి. రాజకీయంగా అలజడి సృష్టిస్తున్నాయి.

To Top

Send this to a friend