జయలలిత గెంటేసేన వ్యక్తికే శశికళ అందలం

పాపం శశికళ.. నోటికాడికి వచ్చిన ముద్ద అందకుండా పోయిన చందంగా మారింది. సీఎం పీఠం ఎక్కబోతున్న వేళ సుప్రీం కోర్టు అక్రమాస్తుల కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడం.. ఈరోజు కోర్టులో లొంగిపోవాల్సిందేనని మరోమారు స్పష్టం చేయడంతో ఆమె నిరాశలో కూరుకుపోయారు. ఒక రాష్ట్రాన్ని ఏలుదామని కలలుగన్న శశికళ అర్థాంతరంగా ఇలా జైలు పాలు కావడం గమనార్హం.
శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు విమానంలో బయలు దేరారు. దీంతో పోలీసులు ఆమెను జైలు కు తరలిస్తారు. ఇక తాను జైలు పాలు కావడంతో అన్నాడీఎంకే బాధ్యతలను శశికళ తన అక్క కుమారుడు దినకరన్ చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఈరోజు నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియమిస్తూ ఆమె నిర్ణయం ప్రకటించి బెంగళూరు పయనమయ్యారు.
కాగా ఇదే దినకరన్ ను అమ్మ బతికుండగా.. పార్టీలో అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడంటూ తన్ని తరిమేసింది. ఇప్పుడు శశికళ జైలు పాలు కాబోతుండడంతో మళ్లీ కుటుంబ సభ్యడైన దినకరన్ కే పార్టీ పగ్గాలు అప్పగించి పోయింది. దీనిపై అన్నాడీఎంకే వర్గాల్లో విభేదాలు చోటుచేసుకున్నాయి. జయలలిత వద్దన్న వ్యక్తిని శశికళ నియమించడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. పన్నీర్ సెల్వం బ్యాచ్ లోకి వెళ్లేందుకు క్యూ కడుతున్నారట.. రాణి లాంటి చిన్నమ్మే పోయాక ఇక ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆత్మస్తైర్యం దెబ్బతింది.. సో ఇక ఎమ్మెల్యేలు చెట్టుకొకరు పుట్టకొకరులా పోతున్నారు. ఈ పరిణామాలు పన్నీర్ నెత్తిన పాలు పోస్తున్నాయి. ఆయనకు బలం అంతకంతకూ పెరిగిపోతోంది..

To Top

Send this to a friend