జయలలితను సమాధి నుంచే లేపడమే క్లైమాక్స్


తాను తీయబోయే శశికళ సినిమాలో క్లైమాక్స్ ఏంటో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పేశారు. తమిళనాడు రాజకీయాలపై మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో మారోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పన్నీర్ సెల్వం-ఫలని స్వామి వివాదం.. రాజకీయ డ్రామా, శశికళ జైలుతో హర్రర్ సినిమాలా ఉందని అప్పట్లో చెప్పిన రాంగోపాల్ వర్మ దీనిపై సినిమా తీస్తానని అప్పుడే ప్రకటించారు. ఇందుకోసం కథను సిద్ధం చేశానన్నారు.
పన్నీర్ సెల్వం-ఫలని స్వామి, శశికళ లు జయలలిత చనిపోయాక కుర్చీ కోసం కొట్టుకోవడాలు.. తమిళుల పరువు తీయడాన్ని జీర్ణించుకోలేక అమ్మ జయలలిత సమాధినుంచి బయటకు వచ్చి బుద్ధి చెప్పడమే క్లైమాక్స్ అని శశికళ సినిమా గురించి వర్మ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. రాజకీయ డ్రామాలకు అమ్మ ఆత్మ పుల్ స్టాప్ పెడుతుందని వర్మ చెప్పారు. వర్మ వ్యాఖ్యలతో శశికళ, ఫళని స్వామి బ్యాచ్ కు పంచ్ పడింది. శశికళను జైలులో దొంగలా చూపిస్తానని కూడా వర్మ చెప్పుకొచ్చారు. 600 దొంగతనం చేసిన వారిని అదే జైలులో వేశారు. అదే ప్రజలను మోసం చేసి 600 కోట్లు కొల్లగొట్టిన శశిని అదే జైలులో వేస్తారా అంతేకంటే పెద్ద శిక్ష వేయాలి అంటూ వర్మ తన మార్క్ మాయాజాలాన్ని ప్రదర్శించారు.

To Top

Send this to a friend