తేనెమనసులు, కన్నెమనసులు చిత్రాల తర్వాత నా మూడో చిత్రం గూఢచారి 116లో జయలలిత నా పక్కన నటించారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. హండ్రెడ్ డేస్ ఆడి నా కెరీర్‌నే మలుపు తిప్పింది. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఆమె గ్లామర్ కూడా ఒక కారణం. నిలువుదోపిడి సినిమాలో కూడా నా పక్కన ఆమె నటించారు. ఆ సినిమా కూడా హండ్రెడ్ డేస్ ఆడింది. అలాగే మేం సొంతంగా నిర్మించిన సినిమా దేవుడు చేసిన మనుషులు చిత్రంలో రామారావుగారి పక్కన ఆమె హీరోయిన్గా నటించింది. అది కూడా సూపర్ డూపర్‌హిట్ అయింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి రాజ్యసభ సభ్యురాలయ్యారు. ముఖ్యమంత్రిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. తమిళనాడు ప్రజలు ఆమెను ఎంతో అభిమానంతో అమ్మా అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పేదలకు హెల్ప్ చేసే మంచి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో ఎప్పుడూ ఒక పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్‌లో మరో పార్టీ అధికారంలోకి వచ్చేది. అలా కాకుండా లాస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై తర్వాతి ఎలక్షన్స్‌లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికవడం తమిళనాడులో చాలా అరుదైన విషయం. ప్రజల హృదయాల్లో ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం తమిళనాడు ప్రజలకి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
