జబర్దస్త్ కేసు.. : హైకోర్టు తీర్పు

అది 2014 జూలై 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టులో జబర్దస్త్ షో నిర్వాహకులు, జడ్జిలు నాగబాబు, రోజా, యాంకర్స్ అనసూయ, రేష్మిలపై ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ లో న్యాయవాదులను, న్యాయమూర్తులను అవమానించేలా స్కిట్ వేశారని.. దీనిపై పరువునష్టం కింద కేసు నమోదు చేయాలని హుజూరాబాద్ కు చెందిన అరుణ్ కుమార్ అనే న్యాయవాది పిటీషన్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై కోర్టు వారందరికి నోటీసులు జారీ చేసింది. దీనిపై జబర్దస్త్ టీం హైకోర్టులో అప్పీలు చేసింది. ఆ కేసు ఈరోజు తుది తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘జబర్దస్త్ లాంటి హాస్యభరిత కార్యక్రమాలపై జనం ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. జబర్ధస్త్ లో జరిగే స్కిట్ లలో న్యాయమూర్తులను అవమానించేలా చేసినా కోర్టుల్లో అలానే జరుగుతుందని అందరూ అనుకుంటారు. ఈ స్కిట్ ల వల్ల న్యాయవ్యవస్థపై తప్పుడు అభిప్రాయం కలిగించే అవకాశం ఉంటుంది. ఇది న్యాయమూర్తులకు, న్యాయవాద ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది.. అయితే కామెడీ భరిత ఈ కార్యక్రమంపై నిషేధం కానీ, నియంత్రణ కానీ వాటిలో ఇంతే చెప్పాలనే మార్గదర్శకాలు లేవు. అదే సమయంలో కామెడీ ప్రొగ్రాంలో చేసిన వ్యాఖ్యలు పరువునష్టం కిందకు రావు’ అని పేర్కొంటూ జడ్జి సత్యనారాయణ జబర్ధస్త్ టీంపై వేసిన పిటీషన్ ను కొట్టివేశారు.

హాస్యం ఎక్కడైనా హాస్యమే.. దానికి అంతుపొంతు.. చిన్న పెద్ద లేదు. హస్యభరితం అనుకుంటే ఎవ్వరినైనా ఇన్వాల్వ్ చేయొచ్చు.. మనిషి నవ్వుకోవడానికి ఉపయోగించే కార్యక్రమాలపై నిషేధం.. నియంత్రణ ఉంటే అసలు అలాంటి ప్రొగ్రాంలే రావు.. అయినా రాజ్యాంగంలో ఇలా హాస్యాన్ని నియంత్రించే స్వేచ్ఛను హరించే మార్గదర్శకులు లేవు. అందుకే జబర్ధస్త్ టీం పై వేసిన కేసు వీగిపోయింది. జబర్ధస్త్ హాస్యానికి మళ్లీ ఊపు వచ్చింది.

To Top

Send this to a friend