జనాల సొమ్ముతో ఆడుకుంటారా.?

నోట్ల రద్దు తో జనాలందరూ తమ ఇళ్లూ వాకిలి అంతా గుళ్ల చేసి సొమ్ము జమచేసి బ్యాంకులో వేసుకున్నారు. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్.బీ.ఐలో లక్షల కోట్లు డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు తీరా డబ్బులన్నీ లోపలేసుకున్నాక ఆర్బీఐ, ఎస్.బీ.ఐ కుటిల నీతికి పాల్పడుతున్నాయి.
భారతదేశంలోని అతిపెద్ద ఎస్.బీ.ఐ చార్జీలు, సర్వీసు రుసుములు పునరుద్ధరించడం పై దేశంలోని ప్రజానీకం, జనాలందరూ మండిపడుతున్నారు. బ్యాంకింగ్ చరిత్రలోనే ఎస్.బీ.ఐ తీసుకున్న నిర్ణయాన్ని బ్లాక్ డే గా వర్ణించారు. ప్రభుత్వ బ్యాంకు చర్యలు పేదలు, మధ్యతరగతి వారికి వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్.బీ.ఐ అన్యాయంగా చార్జీలు పెంచిందని వాపోయారు. కొత్తగా ప్రవేశపెట్టిన రుసుములతో ఖాతాదారులకు ఎదురుదెబ్బ తగిలిందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు సార్లు ఖాతాలోంచి నగదు ఉపసంహరించుకుంటే చార్జీలు వసూలు చేయడం.. అన్యాయమని వాపోతున్నారు..

కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ పకడ్బందీగా జనాలను మోసం చేస్తున్నాయని విశ్లేషకులు మండిపడుతున్నారు.. ముందుగా నోట్లు రద్దు.. ఆ తర్వాత బ్యాంకింగ్ పరిధిలోకి ఫ్రీ ఖాతాలు, జన్ దన్ పేర అందరికీ ఖాతాలు తెరిచారు. ఆ తర్వాత ఇప్పుడు ఖాతాల్లో 5000 కు తక్కువ ఉంటే చార్జీల మోత మొగించారు. ఆర్థిక సామాజ్రావాదాన్ని విస్తరించారు..

ప్రభుత్వం కూడా ఇందుకు సహకరించింది. ప్రజలు బ్యాంకుల్లోనే డబ్బులు జమ చేసేలా ప్రోత్సహించింది. ఇప్పుడు ప్రజల ధనంపై చార్జీలు, సర్వీసు రుసుములు విధిస్తూ అడ్డగోలుగా జనాల్ని దోచుకుంటున్నారు. దీనిపై పోరాటమే శరణ్యంలాగా పరిస్థితి ఉంది.. అందుకే సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఏప్రిల్ 6న నో ట్రాన్సక్షన్ డే గా పాటించి నిరసన తెలపాలని ఉద్యమం నడుస్తోంది.. దీన్ని అందరూ పాటించి ఇందులో భాగస్వాములు కావాలి.

To Top

Send this to a friend