జనవరి 9న మంచు విష్ణు “లక్కున్నోడు” ఆడియో!

manchu-vishnu-lakkunnodu

మంచు విష్ణు కథానాయకుడిగా ఎం.వి.వి.సినిమా పతాకంపై “గీతాంజలి” ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “లక్కున్నోడు”. మంచు విష్ణు సరసన బబ్లీ బ్యూటీ హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. అచ్చు-ప్రవీణ్ లక్కరాజు సంయుక్తంగా సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక జనవరి 9న హైద్రాబాద్ లోని జె.ఆర్.సి కన్వెక్షన్ సెంటర్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహింపబడనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. “హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. మంచు విష్ణు-హన్సికలు జంటగా నటిస్తున్న మూడో సినిమా ఇది. ఇదివరకు వారిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన “దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద” చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో తాజా చిత్రం “లక్కున్నోడు”కి కూడా ఆ కాంబినేషన్ కలిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి, సినిమా కూడా అదే స్థాయిలో అలరించేందుకు ఫిబ్రవరి 3న విడుదలకు సిద్ధమవుతోంది” అన్నారు.
తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు-ప్రవీణ్ లక్కరాజు, చిత్రానువాదం-సంభాషణలు: డైమెండ్ రత్నబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రెడ్డి విజయ్ కుమార్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ-దర్శకత్వం: రాజ్ కిరణ్!

To Top

Send this to a friend