జగన్ xజేసీ బ్రదర్స్.. రసకందాయంలో రాజకీయం..


రాయలసీమ పులులు తలపడుతున్నాయి. రాజకీయం రసకందాయంలో పడింది.. జగన్ వర్సెస్ జేసీ బ్రదర్స్ యుద్ధం ఏపీ పాలిటిక్స్ లో కొనసాగుతోంది. ఇటీవల దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం.. 10 మంది మృతి, 30 మందికి గాయాలు కావడంతో జనంలో జేసీ బ్రదర్స్-దివాకర్ ట్రావెల్స్ పై ఆగ్రహం పెల్లుబుకుతోంది.. జగన్ దీన్ని ఫోకస్ చేశారు. ఆయన పత్రిక సాక్షిలో సైతం పుంఖానుపుకాను కథనాలు వెలువడ్డాయి. సీఎం చంద్రబాబు .. జేసీ బ్రదర్స్ చేతిలో కీలు బొమ్మగా తయారై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని జగన్ ధ్వజమెత్తుతున్నారు.

జగన్ జేసీ బ్రదర్స్ వ్యాపారంపై పడడంతో వాళ్లకు చిర్రెత్తికొచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. తాను ఒక ఎమ్మెల్యేనన్న సంగతి మరిచిపోయి రౌడీయిజం ప్రదర్శించారు. పోలీసులు సహకరిస్తున్నారు. శనివారం తాడిపత్రి నుంచి భారీ సంఖ్యలో వాహనాల్లో జనాలను తీసుకొచ్చి అనంతపురం సాక్షి ఎడిషన్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి ధర్నాకు దిగారు. ధర్నాలో జగన్ ను, వైసీపీ, సాక్షిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట అని బూతులు తిట్టారు. పదవి కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని.. కన్నతండ్రిని కూడా చంపించబోయాడని విమర్శించారు. 2019లో కూడా జగన్ ఓటమి పాలవుతారని.. పిచ్చిపట్టి రోడ్లెమ్మట తిరుగుతారని శాపనార్థాలు పెట్టేశారు. బాధ్యతల గల ఎమ్మెల్యే అధికార పక్షం అయ్యిండి ఇలా ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది..

To Top

Send this to a friend