జగన్ సీఎం అయ్యాకే చనిపోతా..


ఆ అవ్వ కళ్లల్లో ఆనందం వేసింది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను చూడగానే అలానే తన్మయత్వంతో ఉండిపోయింది. ఓ దేవుడిని చూస్తున్నట్టు తీక్షణంగా అలా అవ్వ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. గుంటూరు జిల్లా ఈ పూరుకు చెందిన మేడిబోయిన లక్ష్మమ్మ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని.. ఆయనను గతంలో కలిసిన ప్పుడు శాలువాకప్పి సన్మానించింది. అనంతరం వైఎస్ జగన్ ను చూడాలని ఎంతగానో ప్రయత్నించింది. చివరకు ఆమె కోరిక తెలుసుకొని వైసీపీ నాయకులు హైదరాబాద్ రప్పించారు. వైఎస్ జగన్ ను కలిపించారు. అప్పుడు ఆమె కంట వెంట నీరు వచ్చింది..

‘నిన్ను చూడాలనే ఆశ ఈనాటికి నెరవేరింది.. నిన్ను చాలా ఇబ్బంది పెట్టారయ్యా.. ఎవరికీ భయపడకు.. నువ్ సీఎం అవుతావు.. నువ్వు సీఎం అయ్యాకే నేను చనిపోతా.. నువ్ సీఎం అయితే పేదోళ్లకు మంచి జరుగుతుంది..’ అంటూ అవ్వ జగన్ తో చెప్పింది. అవ్వ అనురాగానికి హతాశుడైన జగన్ ఆమె గుండెలకు హత్తుకుని అప్యాయంగా చూసుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ జగన్ కార్యాలయంలో ఈ అరుదైన సంఘటన జరిగింది..

To Top

Send this to a friend