జగన్ ఫ్యాన్స్ : ‘ఓటుకు నోటు’ను వదిలేశారు..


జగన్ ఫ్యాన్స్ .. ఈ పేరుమీద ఫేస్ బుక్, ట్విట్టర్ , వాట్సాప్ లలో వందల గ్రూపులున్నాయి. అంతా జగన్ అభిమానులే.. అక్కడంతా జగన్నామస్మరణే. కానీ జగన్ పై ఉన్న ప్రేమ ఆయన ఫైట్ చేస్తున్న ప్రత్యర్థిపై లేకపోవడం కలవరపరుస్తోంది.. మంచి అరుదైన అవకాశాన్ని జగన్ ఫ్యాన్స్ మిస్ చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది..

చంద్రబాబు.. దేశంలోని రాజకీయ నాయకుల్లందరి లోకి ఏ కేసు లేకుండా చాకచక్యంగా బయటపడుతున్న నేత.. నాటి ఎన్టీఆర్ హయాం ముగిసినప్పటినుంచి వైఎస్, జగన్ సహా ఎంతో మంది ఆయనపై కేసులు వేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆ కేసులు నిలబడలేదు. చంద్రబాబు స్టామినా ఇక్కడ ప్రస్తావించాలి. ఆయనకు న్యాయ, అడ్మినిస్ట్రేషన్ లో చాలా మంచి పరిచయాలున్నాయి. అన్ని మేనేజ్ చేసే ఒక వర్గం డబ్బుకట్టలతో రెడీగా ఉంటుందట.. అంతేకాదు.. తిమ్మిని బమ్మిని చేసే మీడియా ఆయనకు సపోర్టుగా ఉంటూ వస్తోంది. అందుకే వీటన్నింటినితో చాలా చక్కగా మేనేజ్ చేస్తూ చంద్రబాబు అనేక కేసులలోంచి బయటపడుతున్నారు. కానీ ఒక్కచోట మాత్రం దొరికిపోయారు..

గురువును మించిన శిష్యుడు కేసీఆర్ మాత్రం ఈ రాజకీయ వ్యూహరచనలో చంద్రబాబును మించిపోయాడు. ఒకప్పుడు చంద్రబాబు కింద పనిచేసిన కేసీఆర్ అనంతరం కాలంలో బాగా రాటుదేలారు. అందుకే ఎక్కడ దొరకని చంద్రబాబును ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా ఇరికించి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. పదేళ్లు హైదరాబాద్ మాదే అన్న చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమికొట్టారు. ఇంతటి మహత్తర ఓటుకు నోటు కేసును ప్రతిపక్ష వైసీపీ  కానీ అతడి ఫ్యాన్స్ కానీ సరిగ్గా ఉపయోగించుకోలేదన్నది పెద్ద విమర్శ ..

ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఓటుకునోటుపై సుప్రీంలో చంద్రబాబుపై పిటీషన్ వేశారు. దానిపై విచారణకు సుప్రీం స్వీకరించి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. అక్కడితో ఇది అయిపోలేదు. చంద్రబాబు ఈ కేసులో స్టే తెచ్చుకోవద్దంటూ.. సుప్రీం స్వయంగా ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ change.org అనే వెబ్ సైట్ లో సంతకాల సేకరణను ఓ జగన్ అభిమాని చేపట్టారు. వీటన్నింటిని సుప్రీంకోర్టుకు పంపి చంద్రబాబుకు శిక్ష విధించాలని ప్రయత్నించారు. దీనిపై జగన్ ఫ్యాన్స్ ను ఆహ్వానించారు. కానీ లక్షల్లో ఉన్న జగన్ అభిమానులు దీనిపై స్పందించలేదు. కనీసం సంతకాలు కూడా రాలేదు. మూడు రోజులు గడిచినా కేవలం 11వేల సంతకాలు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాలని ప్రయత్నించిన ఆ సదురు వేదిక సంతకాల సృష్టికర్త ఆ ప్రయత్నాన్ని వదిలేసి మిన్నకుండిపోయాడు. ఇది ఖచ్చితంగా జగన్ అభిమానుల ఫెయిల్యూరే.. లక్ష సంతకాలు.. లేదా పది లక్షల సంతకాలు పెట్టి సుప్రీంకు పంపితే చాలా బాగా ఒత్తిడి పెంచినవారు అయ్యేవారు కానీ.. జగన్ ఫ్యాన్స్ ఇలా అందివచ్చిన అవకాశాన్ని చేజేతులారా వదిలేశారు. ఆ మంచి ప్రయత్నానికి అడ్డుగా నిలిచారు.

To Top

Send this to a friend