జగన్, చంద్రబాబు, పవన్ లలో మీడియా సపోర్టు ఎటు..?

cbn-pawan-jagan

ఏపీ రాజకీయాల్లో పవన్ యాక్టివ్ గా మారడంతో చంద్రబాబు అనుకూల మీడియాకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు పవన్ విషయంలో ఎలా స్పందించాలో తెలియక ఇప్పటివరకైతే చిన్నగా కవర్ చేస్తున్నాయి. కానీ ఉద్దానంలో పవన్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక ప్రత్యక్ష ప్రసారాన్ని కంటిన్యూ చేశాయి.. చంద్రబాబును పొగిడే ఈ రెండు పత్రికలు చానాళ్లు పవన్ పోరాటాన్ని ఎలుగెత్తి చాటడం హాట్ టాపిక్ గా మారాయి..
మీడియా మేనేజ్ మెంట్ లో కింగ్ చంద్రబాబు..
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. అందుకే ఎప్పుడు ఎక్కడ ఎవరిని ప్రయోగించాలో ఎలా గట్టేక్కాలో చంద్రబాబు బృందానికి తెలిసినట్టు ఎవ్వరికీ తెలియదు.. అందుకే చంద్రబాబు ఆపదలో పడిన ప్రతిసారి ఆయనను రక్షించే బాధ్యతను ఆయన అనుకూల మీడియా భుజాలకెత్తుకుంటుంది… 2014 ఎన్నికల్లో జగన్ హవా నడుస్తున్న సమయంలో చంద్రబాబు అనుయాయులైన ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు చక్రం తిప్పి బాబు కు అధికారం వచ్చేలా ప్రచారం చేయించారు. మోడీ అధికారంలోకి వస్తున్నాడని.. ఆయనతో పొత్తులు పెట్టుకోవాలని సూచించి.. జనంలోకి ఆ ప్రచారాన్ని తీసుకెళ్లడంలో రామోజీ, రాధాకృష్ణలు విజయం సాధించారు. అందుకే జగన్ గెలవాల్సి ఉన్నా అభివృద్ధి సెంటిమెంటును ప్రయోగించి చంద్రబాబుకు విజయం దక్కేలా చేశారు. జనాల్ని ఆ దిశగా మలచడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలే కీలకపాత్ర పోషించాయి..

ఇప్పుడు అదే జరిగింది..చంద్రబాబు కష్టాల్లో పడ్డారు. ఓ వైపు జగన్, మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వాన్ని అస్తిర పరిచే పనిలో పడ్డారు. చంద్రబాబు 6 నెలల క్రితం నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 51 సీట్లు వచ్చి బాబు ఓడిపోతాడని తేలిందట… అందుకే ఈ ఆపద నుంచి గట్టెక్కాలని చంద్రబాబు వ్యూహ బృందం ఆలోచిస్తోంది. ఇలా కష్టాల్లో పడ్డ ప్రతిసారి చంద్రబాబును లేపుతున్న రాధాకృష్ణ, రామోజీలు లేకుంటే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండేదో.. జగన్ కు ఆయన మీడియా ఇలా సహకరించట్లేదు కాబట్టే ఆయన ఓడిపోతున్నాడు. ఈ మర్మం తెలిస్తే జగన్ కూడా అధికారంలోకి రావచ్చు.. అయిన చంద్రబాబు చేసినట్టు మీడియా మేనేజ్ మెంట్ ఎవ్వరూ చేయలేరు.. ఎంతైనా చంద్రబాబు అండ్ కో ది తెలివే తెలివి.. ఇక పవన్ కు పాపులారిటీ వెనుక తమ వ్యూయర్ షిప్, రేటింగ్ పోతుందేమోనన్న ఆందోళన చంద్రబాబు అనుకూల మీడియాలో కనిపించింది. అందుకే పవన్ పర్యటనను కొంచెం ఎలుగెత్తి చాటాయి. ఇప్పటికీ రాజకీయంగా దెబ్బతింటున్న చంద్రబాబు,.. తన అనుకూల మీడియాతో పవన్, జగన్ లను దాటేసి 2019 ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతాడో వేచిచూడాలి..

To Top

Send this to a friend