జగన్ ఉదారత.. బాబు కుఠిలత

రాజకీయాలు ఎంత నీచంగా తయారయ్యాయి. మనిషి చావగానే ఉప ఎన్నికలకు గురించి ఆలోచించేంత దారుణంగా ఉన్నాయి. అంతేకాదు.. ఆ సీటు కోసం అప్పుడే బేరసారాలు జరగడం విస్తుగొలుపుతోంది.. భూమా నాగిరెడ్డి చనిపోయిన ఆదివారంసాయంత్రమే లోకేష్ నంద్యాల ఉప ఎన్ని గురించి చర్చించిన విషయం విస్మయం కలిగిస్తోంది.. అంతేకాదు.. ఆయనే ఈ విషయంపై సభలో అఖిలప్రియను రప్పించి ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడించడంతో రాజకీయాలు మరీ ఇంత దిగజారాయా అన్న సందేహం నెలకొంటోంది.

జగన్ భూమా విషయంలో చాలా పరిణతితో వ్యవహరించారు. శవరాజకీయాలు చేయడం ఇష్టం లేక భూమా సంతాప తీర్మానానికి రాలేదు . టీడీపీ సీనియర్ మంత్రి ఒకరు జగన్ కు ఫోన్ చేసి భూమా తీర్మానంపై ఏకగ్రీవ ఆమోదానికి మద్దతు ఇవ్వండి అని కోరారట.. దాంతో జగన్ స్పందిస్తూ.. ‘తప్పకుండా అయితే నంద్యాలలో పోటీ విషయం నష్టపోయిన భూమా కుటుంబ సభ్యులకే వదిలేద్దాం.. వారి ఇష్టమున్న వారిని బరిలో నిలుపుకునే స్వేచ్ఛనిద్దాం’ అని టీడీపీ ముఖ్యునితో అన్నాడట.. కానీ దీనికి టీడీపీ నేత ఒప్పుకోలేదు.. ‘వారికి ఎలా ఇస్తాం.. అభ్యర్థి ఎంపిక బాధ్యత పార్టీనే నిర్ణయిస్తుంది..’ అని చెప్పి జగన్ కు స్పష్టం చేశారట.. దీనికి చిర్రెత్తుకొచ్చిన జగన్ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి అన్యాయం చేస్తారా.. ‘ఎవరి సీటు ఎవరి పార్టీ తరఫున భూమా గెలిచారు.. ఎవరు అక్కడి నుంచి అభ్యర్థిని నిర్ణయిస్తారని’ జగన్ ప్రశ్నించడంతో బిత్తరపోయిన మంత్రి ‘ఏమీ చేయలో మాకు తెలుసు’ అంటూ పెట్టేశాడట..

ఇలా జగన్ భూమా నాగిరెడ్డి కుటుంబం గురించి ఆలోచించి పోటీకి దూరంగా ఉండాలని.. చనిపోయిన ఆ కుటుంబం నుంచి వ్యక్తికి సీటు ఇవ్వాలని టీడీపీ కి ప్రతిపాదించారు. కానీ దీనికి టీడీపీ ముఖ్యులు ఒప్పుకోలేదు. అభ్యర్థిని వాళ్లే నిర్ణయిస్తారట.. అధికారికంగా చెప్పాలంటే భూమా వైసీపీ నుంచి గెలిచారు. టీడీపీలో చేరారు. ఆ సీటు అసెంబ్లీ లెక్కల ప్రకారం వైసీపీదే.. జగనే మరోసారి బీ ఫాం ఇచ్చి అభ్యర్థిని నిలపాలి. కానీ టీడీపీ వాళ్లు తామే కబ్జా చేసినట్టు అభ్యర్థిని నిలబెడతాం అనే సరికి విస్తుపోవడం జగన్ వంతైంది.

జగన్ ఉదారంగా భూమా కుటుంబ సభ్యులకు సీటు ఇస్తే పోటీచేయమని ఉన్నతంగా ఆలోచించాడు. కానీ టీడీపీ కుఠిల నీతితో ఆ సీటుపై కన్నేసింది. అందుకే జగన్ ఇప్పుడు పునరాలోచిస్తున్నాడు. శవరాజకీయాలు చేస్తున్న టీడీపీ వేరే అభ్యర్థిని నిలబెడితే అక్కడ పోటీ చేయాలని జగన్ భావిస్తున్నట్టు సమా చారం.

To Top

Send this to a friend