జక్కన్న నుంచి జాలువారింది..


ఈ శివరాత్రికి జక్కన్న రాజమౌళి అభిమానులకు ఆనందాన్నిచ్చాడు. తన ప్రెస్టేజియస్ మూవీ బాహుబలి2 సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి యావత్ చిత్ర పరిశ్రమకు షాక్ ఇచ్చాడు. ఏం ఫోజు అది.. ప్రభాస్ వీరత్వం.. ధీరత్వం అందులో కనిపిస్తోంది. గజేంద్రుడు ఘీంకారం ప్రతిధ్వనిస్తోంది. కొండంత క్రియేటివిటీ దర్శనమిస్తోంది. జక్కన్న నుంచి జాలు వారిన ఆ మోషన్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది..
మొదటి పార్ట్ వరకు అమరేంద్ర బాహుబలి మరణం సస్పెన్స్ ను మిగిల్చిన రాజమౌళి.. రెండో పార్టులో అమరేంద్ర బాహుబలి కథనే మనకు చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. దేవసేన అనుష్క, బాహుబలి మధ్య ప్రేమాయణం.. రాజ్యం గొడవ.. రానా రాజ్య హస్తగతం.. శివగామి బాహుబలి రాజ్య బహిష్కరణ అనేది ప్రాతిమిక కథ అని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రేమకోసం రాజ్యాన్ని వదులుకున్న రాజుగా బాహుబలి నిలిచిపోతాడనే టాక్ వినిపిస్తోంది.
ఇక శివరాత్రి కానుకగా విడుదలైన బాహుబలి పోస్టర్ ను చూస్తే అందులో సమరానికి సై అన్న బాహుబలి పాత్ర మనకు కనిపిస్తోంది. మదపుటేనుగు తొండంపై ఒక కాలు.. దాని తలపై రెండో కాలు వేసి బాహుబలి రాజ్యం ఎదురుగా వీరావేశంతో చూస్తున్న ఫొటో దుమ్మురేపుతోంది. ఎన్నో అంచనాలతో రూపుదిద్దుకుంటున్న బాహుబలి2 సినిమాపై భారీగా అంచనాలున్న నేపథ్యంలో అందుకు తగ్గ రీతిలో రాజమౌళి సినిమాను తీర్చుదిద్దాడని ఈ చిత్రం చూస్తే మనకు అర్థమవుతోంది..

To Top

Send this to a friend