చైనీస్ వారియర్ అవతార్ లో మోస్ట్ హ్యాపెనింగ్ కమీడియన్

SAPTAGIRIమోస్ట్ హ్యాపెనింగ్ కమీడియన్ సప్తగిరి రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా బిజీగా మారేందుకు ఈ నవ్వుల గిరి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అభినేత్రి అనే ఓ మల్టీలింగ్వల్ హారర్ కామెడీలో నటిస్తున్నాడు సప్తగిరి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సెట్స్ లోనే ఈ చిచ్చిరపిడుగు సందడి చేస్తున్నాడు. ఈ మధ్యనే స్పాట్ లో ప్రభుదేవాతో ఫొటో దిగి సోషల్ మీడియాలోకి అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ పిక్ పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ హల్ చల్ చేశాయి. అదే ఊపుతో త్వరలో రాబోతున్న సునీల్ జక్కన్న సినిమాలో ఓ వినూత్నమైన పాత్రతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది సప్తగిరి నటించిన ఎక్స్ ప్రెస్ రాజా హిట్ ను అందుకోవడం, అంతేకాకుండా ఈ చిత్రంలో సప్తగిరి పోషించిన పొల్యూషన్ గిరి అనే పాత్రకు విశేషాదరణ లభించడంతో ఇండస్ట్రీ వర్గాల మధ్య ఈ కామెడీ కింగ్ పై ఓ లక్కీ సెంటిమెంట్ ప్రచారంలో ఉంది. ఈ నవ్వుల గిరి కాస్తా లక్కీ గిరిగా మారాడని ఫిల్మ్ పండిట్స్ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. పైగా ప్రేక్షకుల పెదాల పై నవ్వుల పువ్వులు పూయించే సప్తగిరి సినిమాకి ప్లస్సే అవుతాడు కానీ మైనస్ అవ్వడని వారు చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో సప్తగిరి ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాడో చూడాలి.

To Top

Send this to a friend