నూలు పోగు అల్లలేక అష్టకష్టాలు పడుతున్న చేనేతన్నల కష్టాలు చూసి పవన్ చలించారు. నేతన్నల ఆకలిచావులు, ఆత్మహత్యలు ఆయన్ను కదిలించాయి. తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కుటుంబాల పరిస్థితులు మెరుగుపరచడానికి జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ ఉదారంగా ముందుకొచ్చారు. వారి బతుకులు బాగు చేయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల నేతలు హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో భేటి అయ్యారు. చేనేత కార్మికులు, పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను, సమస్యలను వారు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. రెండున్నరేల్ల కాలంలో ఒక్క తెలంగాణలోనే 45మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కు వివరించారు. ఇదంతా సావధానంగా విన్న పవన్ కళ్యాణ్ చలించిపోయారు. చేనేతల బతుకులు మార్చడానికి తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ప్రకటించారు.
సంఘాలు అందించిన వినతిపత్రాలను తీసుకొని మాట్లాడిన పవన్.. ఈ సందర్భంగా రాష్ట్రంలో తయారైన చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడమే కాకుండా ఇరు రాష్ట్రాల్లో వారి హక్కుల కోసం జనసేన పార్టీ తరఫున పోరాడుతానని వారికి హామీ ఇచ్చారు. చేనేతలు పని గిట్టుబాటు కాక.. మరే ఇతర పనులు చేసుకోలేక తనువు చాలిస్తున్నాని.. వారిని ఆత్మహత్యలు చేసుకోనియకుండా మనో ధైర్యం కల్పించేందుకు పర్యటిస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చేనేత సంఘం నేతలు ఫిబ్రవరిలో మంగళగిరిలో నిర్వహించే పద్మశాలి గర్జను రావాలని విజ్ఞప్తి చేయగా పవన్ అంగీకరించారు..
