చైతూ అప్పుడే వేరు కుంపటి..!

మంచు మోహన్‌బాబు ఎన్నో చిత్రాలను నిర్మించిన విషయం తెల్సిందే. లక్ష్మిప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై పలు చిత్రాలను నిర్మించి సక్సెస్‌లు కొట్టిన మోహన్‌బాబు కొడుకు సొంతగా 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ అనే ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించాడు. ఇలా పలువురు స్టార్స్‌ వారి కుటుంబంకు వేరే బ్యానర్‌ ఉన్నా కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తాజాగా నాగచైతన్య కూడా అదే పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

ప్రస్తుతం హీరోగా చాలా బిజీగా ఉన్న నాగచైతన్య త్వరలో ఒక సినిమాను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. గతంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ‘ఒక లైలా కోసం’ సినిమా నిర్మాణ బాధ్యతలను స్వయంగా నాగచైతన్య చూసుకున్నాడు. ఆ సినిమా ఫలితం అటు ఇటుగా పర్వాలేదు అనిపించింది. అయితే భవిష్యత్తులో ఇతర హీరోలతో, కొత్త దర్శకులతో సినిమాలు చేసే ఆలోచనలో చైతూ ఉన్నాడు. కాబోయే భార్య సమంత ప్రోత్సాహంతో నాగచైతన్య సొంత బ్యానర్‌ను ప్రారంభించేందుకు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నాగచైతన్య ఆ తర్వాత మరో సినిమాకు కమిట్‌ అయ్యాడు. అక్టోబర్‌లో సమంతను వివాహం చేసుకోబోతున్నాడు. వివాహం తర్వాత నిర్మాణ సంస్థను సొంతంగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతూ నిర్మాతగా వేరు కుంపటి పెట్టాలని భావించడం ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది

To Top

Send this to a friend