చెప్పను బాబు..


ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్ తప్పదంటూ వస్తున్న వార్తలపై రోజా ఈరోజు స్పందించారు. రోజా భేషరతుగా క్షమాపణ చెప్పాలని.. సభకు సారీ చెప్పకపోతే చర్యలు తప్పవని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు శాసనసభలో వ్యాఖ్యానించారు. రోజాను ఎలాగైనా శాసనసభకు రాకుండా ఉండేందుకు అధికార టీడీపీ ప్లాన్ చేసింది. చంద్రబాబును తిట్టినందుకు ఒక ఏడాది.. టీడీపీ ఎమ్మెల్యే అనితపై వ్యక్తిగత దూషణలకు దిగారనీ మరో ఏడాది సస్పెన్షన్ విధించాలని టీడీపీ యోచిస్తోంది..

కాగా రోజా వివాదంపై ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీని చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసింది. దీని ఎదుట రోజా హాజరై వివరణ ఇచ్చింది. ఆ నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టకముందే ‘శిక్ష తప్పదు’ అనే సంకేతాల్ని అధికార పార్టీ పంపుతోంది..

కాగా ఈ వివాదంపై రోజా మాట్లాడారు.. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే అనితకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు.. అసెంబ్లీలో నేనేమీ తప్పుగా మాట్లాడలేదు.. నేనెప్పుడూ తప్పు చేయలేదు. అసెంబ్లీ నుంచి వీడియో క్లిప్పింగ్స్ దొంగిలించి నా వాయిస్ లా డబ్బింగ్ చేయించి నా మీద కొందరు దుష్ప్రచారం చేశారు. అసలు వీడియో క్లిప్స్ చూస్తే వాస్తవం తెలుస్తుంది’ అని రోజా వ్యాఖ్యానించారు. దీంతో సభకు సారీ చెప్పనని.. అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా ఎన్నాళ్లు అడ్డుకుంటారో చూస్తానని రోజా సవాల్ చేశారు.

To Top

Send this to a friend