చిరు 150 వ సినిమాపై పెరిగిన అంచనాలు..

neeru-neeru-song-khaidino150

ఇది నిజం.. ఏ దేశంలోనైతే రైతు సంతోషంగా ఉంటాడో.. సాగుతో సస్యశ్యామలంగా ఉంటుందో ఆ నేల సుభిక్షంగా ఉంటుందని మహాత్ముడు గాంధీజీ ఎప్పుడో చెప్పాడు.. కానీ ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితి లేదు.. అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి సాగు సాగలేక రైతులు ఆత్మహత్యల బాటపట్టారు. కరువు కరాళ నృత్యం చేసిన 2001 నుంచి 2004 వరకు దేశంలో వేల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతటి సున్నిత మైన రైతు ఆత్మహత్యలే ఎజెండా చిరంజీవి జనం ముందుకు వస్తున్నారు. చిరంజీవి 150వ సినిమాలో మెయిన్ సబ్జెక్ట్ రైతు సమస్యలే.. ఇప్పుడు సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ చేసిన ‘నీరు నీరు’ పాట విన్నాక ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతోంది.. ఆ సినిమాపై అంచనాలను పెంచేసింది..
చిరంజీవి తన 150 వ సినిమాపై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ముందు రత్తాలు, ఫోక్ సాంగ్ లను రిలీ జ్ చేసినప్పుడు సినిమా కమర్షియల్ అంటూ జనంలోకి వెళ్లింది. కానీ సినిమా విడుదలకు ముందు రైతు ఘోషపై రిలీజ్ చేసిన నీరు నీరు సాంగ్ విన్నాక ఆ సినిమా చాలా సీరియస్ సబ్జెక్ట్ అని అర్థమైంది. రైతు సమస్యలే ఎజెండా ఇది ప్రభుత్వాలను కడిగేస్తుందని అంచనాలు మొదలయ్యాయి. అదీ చిరు నటిస్తుండడంతో సినిమా విషయంలో వేడి పుడుతోంది..

To Top

Send this to a friend