చిరు వాయిస్ తో ఆ సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది.

భారత్-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇదీ.. టీజర్ చూస్తే ఓ హాలీవుడ్ మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది. తెలుగు హీరో రానా ఇందులో హీరోగా నటించాడు. తాప్సి హీరోయిన్ .. దర్శకుడు సంకల్ప్ ఎంతో శ్రమకోర్చి ఈ సినిమాను తీశాడు. పీవీపీ బ్యానర్ పై తెలుగు, హిందీల్లో చిత్రం తెరకెక్కింది.. ప్రస్తుతం ఈ సినిమాను ఈనెల 17న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యింది..
అయితే ఈ సినిమాకు భారీ హైప్ ను తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.. రానా చేసిన గొప్ప ప్రయత్నంకు ఘాజీ సినిమా ట్రైలర్ ను చూసి ముగ్ధుడైన మెగాస్టార్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చి మరింత ఊపునిచ్చాడు. చిరు వాయిస్ ఓవర్ తో తెలుగు నాట సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ సినిమా కథను వివరిస్తూ చిరు ఇచ్చిన వాయిస్ ఓవర్ తో సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. 17న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ ను సోషల్ మీడియాలో చిరు అభిమానులు సర్క్యూలేట్ చేస్తున్నారు.
చిరు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఘాజీ ట్రైలర్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend