చిరు లేటెస్ట్ ట్రైలర్ చూశాక ఒకటి అనిపిస్తోంది..

theatrical_trailer-khaidino150

చిరంజీవ 150 చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది.. ఈ నేపథ్యంలో చిరు హ్యాయ్ లాండ్ లో నిర్వహించిన ప్రీ రీలీజ్ ఆడియో వేడుకకు భారీగా హాజరయ్యారు.చిరు సినిమాను అభిమానుల్లోకి బలంగా తీసుకెళ్లారు.. రైతు సమస్యలే ఎజెండా రూపొందిన ఈ చిత్రంలో పాటలు ఓ ఊపు ఊపేస్తున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు జనాలను ఉర్రూతలూగిస్తున్నాయి. చిరు చాన్నాల్ల తర్వాత వేసిన స్టెప్పులు సైతం అదిరిపోయేలా ఉన్నాయి. హీరోయిన్ అందాలు, వినాయక్ డైరెక్షన్, దేవీ మ్యూజిక్ తో సినిమాపై హైప్ నెలకొంది. కానీ..

చిరు సినిమా ప్రీ రిలీజ్ ఆడియో వేడుక తర్వాత విడుదలైన లేటెస్ట్ ట్రైలర్ చూశాక జనంలో విశ్లేషకుల్లో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది.. ఈ సినిమా కథను ట్రైలర్ లో రిలీజ్ చేశారు. రైతు సమస్యలపైనే మొత్తం కథ చుట్టు తిరుగుతుందని అర్థమైంది. ఓ కార్పొరేట్ సంస్థ అధిపతికి.. రైతులకు మధ్య వార్ లో చిరంజీవి వచ్చి పోరాడాడని ట్రైలర్ ను చూస్తే అందరికీ అర్థమవుతోంది. ఇది పాత కథే.. మరి దీన్ని ఎలా ప్రెజెంట్ చేశారోనన్న ఆసక్తి మాత్రం నెలకొంది. రైతు సమస్యలు, చిరు పోరాడడం… కార్పొరేట్ భూ మాఫియాను ప్రధానం గా ఫోకస్ చేశారు. ఇలాంటివి బాలీవుడ్, టాలీవుడ్ లో చాలా సార్లు వచ్చాయి. మరి చిరు ఏ మేరకు దీన్ని హిట్ గా మలిచారోనన్న ఆసక్తి సర్వాత్రా నెలకొంది. సినిమా విడుదల అయిన తర్వాతే మనకు ఏ విషయం తేలనుంది.

చిరంజీవి ఖైదీ నంబర్ 150 లేటెస్ట్ ట్రైలర్ ను కింద చూడొచ్చు..

https://www.youtube.com/watch?v=UwYfxVlwy64

To Top

Send this to a friend