చిరు, పవన్, రాంచరణ్, అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను: TSR

మరోసారి అదే మాట.. అదే స్పష్టం.. చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ ఆడియో వేడుకలో మాట్లాడిన నిర్మాత, ఎంపీ టీ . సుబ్బిరామిరెడ్డి మరోసారి దాన్నే పునరావృతం చేశాడు. చిరంజీవి ఖైదీ నంబర్ 150 రిలీజ్ అయి.. వారంలోనే 100 కోట్లు కొల్లగొట్టిన సందర్భంగా.. చిరు రీఎంట్రీని పురస్కరించుకొని టీ. సుబ్బిరామిరెడ్డి హైదరాబాద్ లో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి హీరో నాగార్జున, అమల, రాంచరణ్, చిరు భార్య సురేఖ, అఖిల్, శ్రీకాంత్, అలీ, బ్రహ్మానందం, పరుచూరి బ్రదర్స్, అల్లు అరవింద్, జయప్రద, పూరి జగన్నాథ్, సత్యానంద్, అశ్వీనీదత్, చార్మి, కోదండరామిరెడ్డి, వివి వినాయక్, బీ గోపాల్, జెమనీ కిరణ్, దిల్ రాజు, పీవీపీ, గోపీచంద్ తదితరులు హాజరై చిరంజీవిని సన్మానించారు..

ఈ సందర్భంగా టి. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. తాను చిరు ఆడియో ఫంక్షన్ లో అన్నట్టు చిరు, పవన్, రాంచరణ్, అల్లు అర్జున్ లతో కలిసి మల్టీస్టారర్ సినిమా తీస్తానని.. ఎంత ఖర్చైనా పర్లేదు అని స్పష్టం చేశారు.దీనికి అశ్వీనిదత్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తారని తెలిపారు. తెలుగు సినిమా మార్కెట్ అంతర్జాతీయ స్తాయికి వెళ్లిందని.. ఈ నలుగు రు హీరోలు కలిస్తే.. అన్ని రికార్డులు తిరగరాస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవితో స్టేట్ రౌడీ తీస్తే రికార్డులు నమోదయ్యాయయని.. అదే అనుబంధంతో తాను తీసే సినిమా చరిత్రలో నిలిచిపోతుందని సుబ్బిరామిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరు తనకు సన్మానం చేసిన సుబ్బిరామిరెడ్డి, ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాకు విజయాన్నందించిన అభిమానులను మరిచిపోనని చెప్పారు..

To Top

Send this to a friend