చిరు ఖైదీ నంబర్ 150 అద్భుతం.. సినీ క్రిటిక్స్ రేటింగ్ 4/5

khaidino150

చిరంజీవి చాలా రోజుల గ్యాప్ తర్వాత తీసిన ఖైదీనంబర్ 150 మూవీ అద్భుతమని ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా అద్బుతంగా తెరకెక్కించారని ఏకంగా 4/5 రేటింగ్ ఇచ్చి కీర్తిస్తున్నారు.. సెన్సార్ బోర్డు సభ్యుడు, యూఏఈ, యూకే, ఇండియాలో ఫేమస్ అయిన సౌత్ ఆసియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్, ఫిల్మ్ క్రిటిక్ అయిన ఉమేర్ సంధు చిరంజీవి 150 వ సినిమా బెన్ ఫిట్ షో చూసి ఈ రేటింగ్ ఇచ్చాడు.. ఈ సినిమా బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. బెన్ ఫిట్ షోలను మంగళవారం ఆయా చోట్ల వేశారు. అది చూసిన ప్రేక్షకులు, విశ్లేషకులు, ఫిల్మ్ క్రిటిక్స్ చిరు 150 వ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో రాసేస్తున్నారు..

చిరు 150 వ సినిమాలో సమాజానికి మంచి చేసే సోషల్ మేసేజ్ ఉందని.. కమర్షియల్ హిట్ సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.. టెక్నికల్ పరంగా సినిమా అద్భుతమని.. స్టోరీ, స్క్రీన్ ప్లే , సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్టోర్ చాలా బాగా వచ్చిందని కితాబిస్తున్నారు.. ఫస్ట్ , సెకండ్ ఆఫ్ అద్భుతంగా ఉందని.. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను నడిపించిన తీరు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని తెలిపారు. ఇక క్లైమాక్స్ ఫైటింగ్ మైండ్ బ్లోయింగ్ అని ఉమేర్ సంధు వ్యాఖ్యానించారు. డైలాగులు, డ్యాన్సులు, సినిమా నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉన్నాయని వివరించారు..

ఫర్ఫామెన్స్ పరంగా మెగాస్టార్ చిరంజీవి నటన అతడి జీవితంలోనే అత్యంత గొప్పగా ఈ సినిమాలో నిలిచిపోయిందని ఉమేర్ సంధు ప్రశంసల్లో ముంచెత్తారు.. కాజల్ అగర్వాల్ అందంగా కనిపించిందని.. నటలో చిరంజీవితో సమానంగా చేసిందన్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని తెలిపారు. విలన్ తరుణ్ అరోర నటన కూడా బాగుందన్నారు. రాయి లక్ష్మీ, చిరు ఐటం సాంగ్ చిత్రానికే హైలెట్ అని కొనియాడారు..

మొత్తంగా దర్శకుడు వి.వి. వినాయక్ ఎంతో పొటెన్షియల్ గా సినిమా తీశారని.. అనేక మలుపులు, సంభ్రమాశ్చార్యాలతో సినిమా చూసినంత సేపు మోకాళ్లపై నిలబెట్టిందని.. ఈ సినిమా చిరంజీవి సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మిగిలిపోతుందని ఉమేర్ సంధు తన ట్విట్టర్, ఫేస్ బక్ ఖాతాల్లో చిరు సినిమా గురించి రాసుకొచ్చారు..

To Top

Send this to a friend