చిరు ఖైదీనంబర్ 150పై రాజమౌళి కామెంట్

జక్కన్న రాజమౌళి.. ఎంత బాగా సినిమా తీయగలడో.. అంతే బాగా సినిమాలను అంచనావేస్తాడు.. ఏ సినిమానైనా ఫస్ట్ షోల్లోనే చూడడం ఆయనకు అలవాటు.. తెలుగు, హిందీల్లో ఏ మంచి సినిమా విడుదలవుతున్నా జక్కన్న ఖచ్చితంగా చూసి అది బాగుందని.. ఆ సినిమాలో ఈ విషయాన్ని సృశించారని.. రివ్యూ చెప్పేస్తుంటాడు.. గతంలో పీకే కానీ, తెలుగులో విడుదలైన చిన్న సినిమాలను కానీ వదలకుండా చూసి కితాబిస్తుంటారయ..
బుధవారం విడుదలైన చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాను జక్కన్న బుధవారం ఉదయమే ప్రీమియర్ షోలో చూసేశాడట.. దీన్ని చూసి ట్విట్టర్ తన రివ్యూ రాశాడు.. ‘బాస్ ఈజ్ బ్యాక్.. చిరంజివి గారు మళ్లీ సినిమాల్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు.. పదేళ్లుగా మిమ్మల్ని చాలా మిస్సయిపోయా.. రికార్డ్ బ్రేకింగ్ మూవీతో నిర్మాతగా అరంగేట్రం చేసిన చరణ్ కు కంగ్రాట్స్.. దర్శకుడు వినాయక్ కుమ్మాశారంతే.. వినాయక్ కంటే ఎవరూ ఈ సినిమాను ఇంత బాగా తీయలేరు.. ఖైదీ టీమ్.. హ్యావ్ ఏ బ్లాస్ట్ అంటూ రాజమౌళి ట్విట్టర్ ఖైదీ సినిమాను ఆకాశానికేత్తేశారు..

To Top

Send this to a friend