మెగాస్టార్ తో స్టేజి పంచుకోవడం అంటే మాటలా..? కానీ ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నానని బాధపడుతోంది యాంకర్ అనసూయ.. బజర్ధస్త్ లాంటి కామెడీ షోతో హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయకు చిరు అవకాశమిచ్చారు.. మెగస్గార్ తన లేటెస్ట్ మూవీ ఖైదీనంబర్ 150 సినిమా ప్రిరిలిజ్ ఫంక్షన్ కు యాంకర్ గా ముందు చిరు టీం అనసూయను సెలక్ట్ చేసిందట.. దీనికి అనసూయా కూడా ఓకే చెప్పి జనవరి 4న విజయవాడ ఫంక్షన్ కు రెడీ అయ్యిందట.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఆడియో వేడుకకు పర్మిషన్ రాక జనవరి 7కు వాయిదా పడింది. దీంతో అప్పటికే ఇతరులకు కాల్షీట్లు ఇచ్చిన అనసూయ ఆ అవకాశాన్ని వదులుకుందట..
దీంతో జనవరి 7న హ్యాయ్ లాండ్ లో జరిగిన సినిమా వేడుకలో యాంకర్ సుమ దగ్గరుండి నడిపించింది.. అనసూయ వీలుకాకపోవడంతో యాంకర్ సుమ ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసింది.. అందుకే ఈ ప్రెస్టేజియస్ మూవీని తాను మిస్సయానని బాధపడుతోంది యాంకర్ సుమ..కానీ ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటోంది..
