చిరంజీవి ఈ పాటతో అందరినీ ఏడిపించాడు..

neeru-neeru-song-khaidino150

చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ సినిమాలోని రైతు కష్టాలపై పాటను ఈరోజు విడుదల చేశారు. సోషల్ మీడియాలో చిరంజీవి, చిత్ర బృందం, రాంచరణ్ లు విడుదల చేశారు. ‘నీరు నీరు.. రైతు కంట నీరు’ అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. రైతుల కష్టాలు, కడగండ్లు, ప్రభుత్వాల అసమర్ధతను ఈ పాటతో ఎత్తిచూపారు.. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో వస్తున్న చిరంజీవి చిత్రంలో మాస్ సాంగ్ లతో పోల్చిచూసినప్పుడు ఈ పాటను విన్నవారి హృదయం ఖచ్చితంగా ద్రవిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు..
దేవీ శ్రీ ప్రసాద్ అద్భుత సంగీతాన్నిందించిన ఈ చిత్రంలో రైతు కష్టాలపై పాడిన పాటను శంకర్ మహదేవన్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి రచించారు.

చిరంజీవి ఖైదీనంబర్ 150లోని రైతు కష్టాల పాటను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend