చిన్నవాడి దర్శకుడితో చక్రి చిగురుపాటి చిత్రం!

chakri

పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని సైతం తట్టుకొని చాలా పెద్ద విజయం సాధించే దిశగా దూసుకుపోతున్న “ఎక్కడికీ పోతావు చిన్నవాడా” చిత్ర దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఆ సినిమా విడుదలైన రెండో రోజే తన తదుపరి చిత్రాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. నిఖిల్ కు “స్వామి రారా” లాంటి సూపర్ హిట్ ను నిర్మించిన యువ నిర్మాత చక్రి చిగురుపాటి విఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. రాజేష్ దండా నిర్మాణ సారధిగా వ్యవహరించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి.

ఇటీవలే “లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్” బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.4గా “నా పేరు శివ” ఫేమ్ సుశీంద్రన్ దర్శకత్వంలో సందీప్ కిషన్-మెహరీన్ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభించడం తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం అనంతరం తమ  బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.5గా.. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కేఈ చిత్రంలో ఓ ప్రముఖ యువ కథానాయకుడు నటించనున్నాడని, హీరోయిన్ తో పాటు మిగతా నటీనటులు, మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని సహ నిర్మాత రాజేష్ దండా తెలిపారు.
వీలైనంత త్వరగా ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి డిసెంబర్ నెలాఖరుకు లేదా వచ్చే ఏడాది ప్రారంభ మాసంలో రెగ్యులర్ షూట్ ను ప్రారంభించనున్నామని నిర్మాత చక్రి చిగురుపాటి చెబుతున్నారు!!
To Top

Send this to a friend