చాలా పకడ్బందీ వ్యూహంతో పవన్ టూర్?

బయటకు కనిపించేదంతా ఒకలా ఉంది. అమెరికా వెళ్లాక పవన్ సాగిస్తున్న పర్యటన మరోలా ఉంది. పవన్ చాలా పకడ్బందీ వ్యూహంతోనే అమెరికా పర్యటనకు వెళ్లినట్టు అక్కడ ఆయన సాగిస్తున్న పర్యటన బట్టి తెలిసిపోతోంది.. ఇన్నాళ్లు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించడానికే పవన్ అమెరికా వెళ్లాడాని ప్రపంచానికి తెలుసు కానీ.. పవన్ తన రాజకీయ పార్టీ భవిష్యత్తు.. ఏపీ సమస్యలకు పరిష్కారం వెతికే పనిలో భాగంగా అమెరికాలో వివిధ చోట్లకు తిరుగుతూ పరిశోధన చేస్తున్నట్టు తెలిసింది.
పవన్ న్యూహ్యాంప్ షైర్ లోని సీబ్రూక్ లో గల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను సందర్శించారట.. ఇలాంటి ప్లాంట్ల వల్ల కలిగే లాభనష్టాలను అధ్యయనం చేశాడట.. ఇప్పటికే ఇలాంటి ప్లాంట్లే ఉత్తరాంధ్ర, నెల్లూరులలో ప్రజలు వ్యతిరేకిస్తున్న దరిమిలా ప్లాంట్లపై పూర్తి అధ్యయనం పవన్ చేసినట్టు తెలిసింది. ఏపీకి వచ్చాక ప్లాంట్లపై తన విధివిధానాలను ప్రజలకు చెప్పాల్సిన విషయాలపై అక్కడ కసరత్తు చేసినట్టు సమాచారం.
అంతేకాదు చిరంజీవి ఇప్పటికే రాజకీయాల్లో ప్రత్యక్షంగా దిగి రాణించకపోవడంతో పవన్ తన రాజకీయ అడుగులు చాలా జాగ్రత్తగా వేయడానికి సంకల్పించారు. అందుకే అక్కడి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త స్టీవ్ జార్జింగ్ తో గంటల తరబడి చర్చలు జరిపారు. ఇలా పవన్ రాజకీయంగా, సామాజికంగా అనేక అంశాలపై అమెరికాలో పరిశోదనలు సాగిస్తూ వివిధ వ్యక్తులను కలుస్తూ పెద్ద అడుగే వేసేందుకు ప్లాన్ చేసినట్టు అమెరికా పర్యటన ను బట్టి అర్థమవుతోంది..

To Top

Send this to a friend