చంద్రబాబే నాకు పోటీ:

ఏపీ సీఎం కొడుకు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ తన స్ట్రెంత్ ఏంటి..? వీక్ నెస్ ఏంటో చెప్పేశాడు.. తనకు రాజకీయాల్లో కేటీఆర్, జగన్ లు పోటీ కారని.. తన నాన్న చంద్రబాబే తనకు పోటీ అని చెప్పి సంచలనం సృష్టించాడు. కేటీఆర్, జగన్ లు వారి దారులు వారివే.. కానీ మా ఇంట్లో ఉండే నాన్న చేసే అభివృద్ధి, సీఎం ఆయన బాధ్యతలు చూశాక.. ఆయనలాగా అవ్వాలని ఆయన్నే పోటీగా ఎంచుకున్నానని లోకేష్ బాబు అన్నారు.

మీ బలం, బలహీనత ఏంటి అని ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ప్రశ్నించగా.. తనకు ప్రజలే బలం అని.. కానీ తిండి తన వీక్ నెస్ అన్నారు ఈ పప్పూ బాబు.. తిండి తినడం మొదలుపెడితే ఆగదని.. అలా తినుకుంటూనే పోతానన్నారు. ఆ అలవాటును మానుకోలేకపోతున్నానని చెప్పారు.

ఇక మా నాన్న చంద్రబాబు తనకు ఇంతవరకు ఒక చొక్కా ప్యాంటు కొనివ్వలేదని.. కానీ నా కొడుక్కి బట్టలన్నీ కొన్నిచ్చింది ఆయనేనని చెప్పారు. నాన్నను బయట సార్ అని పిలుస్తానని.. అలా ఇంట్లో నాన్న అని అంటానని తెలిపారు. డాడి అని పిలవడాన్ని మా అమ్మ ఒప్పుకోదని చెప్పారు. ఎంతైనా ఎన్టీఆర్ కూతురు కదా.. అందుకే అమ్మ రూల్స్ బాగా పాటింపచేస్తుంది అని లోకేష్ బాబు తన ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాలను రిలీజ్ చేశాడు.

To Top

Send this to a friend