చంద్రబాబు ముఖ్య మంత్రి అయ్యాక రాష్ట్రానికి చేసిందేమీ లేదు..-జగన్

y-s-jagan

చంద్రబాబు ముఖ్య మంత్రి అయ్యాక రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. మూడేళ్ల నుంచి రాయలసీమ కరువుతోనే బాధపడుతోందని విమర్శించారు జగన్. వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రైతు భరోసాయాత్రలో బాబు పాలనపై నిప్పులు చెరిగారు.. వైఎస్ తన హయాంలో దాదాపు 23 లక్షల ఎకరాలను పేదలు, దళితులకు ఇస్తే బాబు వచ్చి ఆ భూముల్ని లాక్కొని పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.. వైఎస్ రాయలసీమకు శ్రీశైలం నుంచి నీళ్లు ఇస్తే.. ఇప్పుడు రాయలసీమ రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని జగన్ విమర్శించారు. కేబినెట్ సమావేశాల్లో రైతుల సమస్యలను పట్టించుకోకుండా వాళ్ల భూములను లాక్కునే నిర్ణయాలకే బాబు అంగీకారం తెలపడం భావ్యం కాదని విమర్శించారు.

వైఎస్ 108, ఆరోగ్య శ్రీ వంటి గొప్ప పథకాలు తెస్తే వాటిని బాబు భష్ట్రు పట్టిస్తున్నారని.. ఉద్దానం బాధితులకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయని మండిపడ్డారు. అబద్ధపు హామీలతో రైతులు, మహిళలు, విద్యార్థులు సహా అందరినీ బాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తిని మనమందరం కలిసి బంగాళాఖాతంలో కలిపేద్దామని కర్నూలు రైతులకు ఆయన పిలుపునిచ్చారు..

To Top

Send this to a friend