చంద్రబాబు మరో కొత్త స్కీమ్ అంటున్నారు?

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్.ఆర్.ఐలు గ్రామాలలో సేవలందించేందుకు అమ్మ ఆంద్రప్రదేశ్ పేరుతో మరో కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నారావారి పల్లెలో సంక్రాంతి వేడుకల సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.దీని ప్రకారం ప్రవాసాంద్రులు తమ జన్మ స్థలాన్ని మర్చిపోకుండా ఉండడకోసం , వారు తమ గ్రామాలలో మంచిపనులు చేయడానికి ఈ స్కీమ్ చేపడుతామని తెలిపారు.కాగా ఇదే సందర్భంలో ఎన్.ఆర్.ఐ లను ఉద్దేశించి మాట్లాడుతూ వారు సామాజిక కోణం విస్మరిస్తున్నారని, ఇలాగైతే సింగపూర్,అమెరికాలను కూడా నాశనం చేస్తారని అన్నట్లు మీడయాలో వార్తలు వచ్చాయి. మరి దాని అర్దం ఏమిటో తెలియదు.ఇప్పటికే ఎన్.ఆర.ఐ.లకు సంబందించి జన్మభూమి , గ్రామదత్తత వంటి కార్యక్రమాలను చంద్రబాబు గతంలో ప్రకటించారు.వాటి సంగతి ఏమైందో తెలియదు.

To Top

Send this to a friend