చంద్రబాబు నోటి వెంట.. ఓటమి మాట..

ఏదైనా కానీ ఒక రాష్ట్రంలో శాంతిభద్రతలు, బలమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు తరలివస్తాయి. ఆ విషయం తెలుసు కనుకే బోటాబోటీగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర పార్టీల నేతలను లాగి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకున్నారు. మొదటి సంవత్సరమంతా అదే పనిలో ఉన్న కేసీఆర్ రెండు, మూడో ఏడాది రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాడు.

పెట్టుబడులు రావాలంటే ముందు రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత అవసరమని ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా వ్యాఖ్యానించారు. మహానాడు ముగిశాక సోమవారం సీఎం టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీలోని అసంతృప్తులు, అసమ్మతి, క్రమశిక్షణారాహిత్యంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కదని హెచ్చరించారు. ప్రభుత్వం వచ్చేసారి అధికారంలోకి వస్తుందని తెలిస్తేనే పెట్టుబడుదారులు రాష్ట్రానికి వస్తారని.. లేకుంటే రారని బాబు వ్యాఖ్యానించారు.

జగన్ దూసుకొస్తున్నారు. జనసేనాని టీడీపీని టార్గెట్ చేశారు. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం టీడీపీ నేతలే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. దీంతో వచ్చేసారి గెలవడంపై చంద్రబాబే మీమాంస వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.. పెట్టుబడుదారులు ఏపీ బాట పట్టకపోవడం వెనుక వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందో రాదోనన్న భయమే కారణమని చంద్రబాబు టీడీపీ నేతలతో అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే 2019 ఎన్నికల్లో ఓటమి భయం చంద్రబాబును ఇప్పటి నుంచి వెంటాడుతుందన్న మాట..

To Top

Send this to a friend