చంద్రబాబు నోటివెంట కేసీఆర్ పై ప్రశంసలు..

బర్త్ డే అని చెప్పాడో .. లేక నిజంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శక్తి సామర్థ్యాలు నిజమని నమ్మాడో తెలియదు కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారి కేసీఆర్ ను ఆకాశానికెత్తేశాడు.. కేసీఆర్ పాలన.. తెలంగాణ ముందుకు దూసుకుపోతున్న తీరును ప్రశంసించారు. ‘‘ ఏ నాయకుడిని కులాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజలు ఓట్లేయరని.. అతనిలో సామర్థ్యం, ప్రజల్లో కేసీఆర్ పై ఉన్న నమ్మకమే ఓట్లు పడేలా చేస్తుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల మనసులను చూరగొన్నాయని   ప్రజల నాయకుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి నిలిచిపోయారని’’  కేసీఆర్ ను ప్రశంసల్లో ముంచెత్తారు.. ఇదంతా విజయవాడలోని తెలుగుదేశం వర్క్ షాప్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జరిగింది.

దీనిపై ఏపీ ప్రతిపక్ష వైసీపీ నేతలు స్పందించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చంద్రబాబు కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. అందుకే ప్రశంసిస్తూ తన ఓటు కు నోటు కేసును రద్దు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసును తిరగదోడకుండా ఉండేందుకే ఇలా బాబు చేస్తున్నాడని సెటైర్లు వేశారు..

ఓటు కు నోటు కేసు తర్వాత చంద్రబాబు-కేసీఆర్ లు ఉప్పునిప్పులా ఉన్నారు. అమరావతి నగర నిర్మాణ ప్రారంభోత్సవంలో మళ్లీ వీళ్లిద్దరు ప్రధాని మోడీ సమక్షంలో కలిశారు.  ఆ తర్వాత మంచి సంబంధాలు నెరుపుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏకంగా విజయవాడలోని ఓ కార్యక్రమంలో కేసీఆర్ ను ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

To Top

Send this to a friend