చంద్రబాబు-జగన్.. ఎవరినీ గోముత్రంతో శుద్ధి చేయాలి?

గడిచిన రెండు దశాబ్దాలతో పోలిస్తే నేడు రాజకీయాలు దారుణంగా దిగజారాయి. ఎన్టీఆర్ బతికి ఉన్నంత వరకు ఉమ్మడి ఏపీలో రాజకీయాలు కొంతవరకు నిబద్ధతతో సాగాయి. ఎప్పుడైతే చంద్రబాబు మామను కూలదోసి డబ్బులు వెదజల్లి అధికారంలోకి వచ్చాక అప్పటినుంచే ఏపీ రాజకీయాల్లో వింత ధోరణి నెలకొంది. అరిచిన వాళ్లను అణచడం.. లేదా కొనేయడం మొదలైపోయింది. సమైక్య ఏపీలో కూడా ఇదే తంతు కొనసాగింది..

తాజాగా మరో రాజకీయం ఏపీని అభాసుపాలు చేస్తోంది.. ప్రతిపక్షాలు పోరాడుతుంటాయి. అధికారంలో ఉన్నవాళ్లకు కాస్త ఓపిక ఉండాలి. కానీ టీడీపీలో అది లోపించింది.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ఓదార్పుయాత్రలు, ప్రత్యేక హోదా వివిధ బాధితులను పరామర్శిస్తూ ఏపీలో పర్యటిస్తున్నారు. ఆయన రాకను.. జనాదరణను అధికార టీడీపీ నేతలు సహించలేకపోతున్నారు.. ఇటీవల అమరావతిలో పర్యటించినప్పుడు కానీ.. విశాఖలో జగన్ పర్యటన తర్వాత కానీ ఏపీ టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరు సమాజం సిగ్గుపడేలా ఉంది. జగన్ పర్యటన ముగిశాక అమరావతిలో ఆయన పర్యటించిన ప్రాంతాల్లో టీడీపీ నాయకులు గోమూత్రం చల్లడం తీవ్ర వివాదాస్పదమైంది.. గోమూత్రంతో అపవిత్రం పోవాలని ఇళ్లలో చల్లుకోవడం చూశాం కానీ.. ఇప్పుడు దాన్ని జగన్ పర్యటన ముగిశాక ఆయన వెళ్లిన ప్రాంతాల్లో చల్లడం వివాదం అయ్యింది. కానీ దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు కూడా చంద్రబాబు పర్యటించిన ప్రాంతాల్లో గోమూత్రం చల్లడానికి ప్రయత్నించారు. అధికార పార్టీ అండదండలతో పోలీసులు వారిని అరెస్ట్ చేయించారు. ఇలా ఏపీలో అదికార, ప్రతిపక్షాలు గోమూత్రంతో అంటకాగుతున్నాయి. ఒకరినొకరు వెగటుపుట్టేలా రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు మరీ ఇంతలా దిగుజారాయా అని అందరూ వాపోతున్నారు. టీడీపీ, వైసీపీ నేతల చిల్లర రాజకీయాల తీరును ఎండగడుతున్నారు. ఇంత దిగజారిన రాజకీయాలు చేయిస్తున్న చంద్రబాబు-జగన్ లనే గోమూత్రం తో కడగాలని కోరుకుంటున్నారు.

To Top

Send this to a friend