చంద్రబాబు ఓటమి.. జగన్ సీఎం.. పవన్ పోటీ చేయాల్సిందే..

అందిరదీ ఒకటే టార్గెట్.. 2019 ఎన్నికల్లో విజయం సాధించడం.. ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజకీయాలు నడుస్తున్నాయి. ఇందులో జగన్ ఈసారి సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పవన్ తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏకంగా దోస్తీకట్టిన టీడీపీ, బీజేపీతోనే కయ్యానికి దిగాడు. హోదా కోసం పోరు సలుపుతున్నాడు.. పవన్ మరి 2019 ఎన్నికల్లో నిలబడతాడా.. నిలబడితే గెలుస్తాడా.. లేక ఓట్లను చీల్చి ప్రత్యర్థి జగన్, చంద్రబాబులకు అధికారాన్ని దూరం చేస్తారా.. అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది..

గడిచిన 2009 ఎన్నికల్లో ఇప్పుడు పవన్ లాగా చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి వైఎస్ నెత్తిన పాలు పోశాడు. ఉమ్మడి ఏపీలో దాదాపు 17శాతం ఓట్లను చీల్చి చంద్రబాబుకు అధికారాన్ని దూరం చేశాడు. కాపు సామాజికవర్గమంతా ఏపీలో చిరంజీవికి ఓటేశారు. అవి నిజంగా చంద్రబాబుకే పడే ఓట్లు… రెడ్లు, బీసీ, ముస్లింలు వైఎస్ పక్షాన నిలవగా.. చంద్రబాబుకు ఇతర వర్గాలు మద్దతిచ్చాయి. కాపులు గంపగుత్తగా చిరుకే ఓటేశారు. అప్పుడు చంద్రబాబు, వైఎస్ కు ఓట్ల తేడా కేవలం 5శాతమే.. అదే చిరు పోటీ చేయకుంటే ఖచ్చితంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చేవారని విశ్లేషకులు అంచనావేశారు.

వచ్చే 2019 ఎన్నికల్లో కూడా 2009 ఎన్నికల సమీకరణాలు దాపురించబోతున్నాయి. అప్పుడు చిరు లాగానే ఇప్పుడు పవన్ రాజకీయంగా బలపడుతున్నారు. కాపు ఉద్యమం కూడా చంద్రబాబుపై ఉవ్వెత్తున లేస్తోంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే 2019 ఎన్నికలు జరిగితే చంద్రబాబు, జగన్, పవన్ లు పోటీచేస్తే కాపులంతా పవన్ వెంట నిలుస్తారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న మిగతా వర్గాలు రెడ్లు జగన్ వెంట నడుస్తారు. ఇలా పవన్ పోటీ చేస్తే అది అంతిమంగా చంద్రబాబు సీటుకే ఎసరు.. గత 2009 ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయి. అందుకే జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జనసేన అధినేత పవన్ ను ఎక్కడ విమర్శించడం లేదు. పైగా పవన్ సపోర్టు చేసి విశాఖ హోదా ఆందోళనల్లో జగన్ స్వయంగా పాల్గొనడం విశేషం.. ఇలా పవన్ తో సాన్నిహిత్యం నెరిపేందుకు జగన్ చొరవ చూపుతున్నారు. పవన్ ఒకవేళ ఒంటరిగా వెళ్లినా జగన్ కే లాభం.. లేదా జగన్, పవన్ లు కలిసి పోటీచేసినా జగన్ కే లాభం.. చంద్రబాబు తీవ్ర నష్టం.. ఈ పరిణామాలన్నింటితో ఇప్పుడు వచ్చే ఎన్నికల ముఖచిత్రంలో పవన్ చాలా కీలకంగా మారారు. జగన్ ను సీఎం అయ్యేందుకు పవన్ కీరోల్ లా నిలిచారు

To Top

Send this to a friend