చండ్రనిప్పులు.. పోలవరం తిప్పలు..


చంద్రబాబు ప్రధాన టార్గెట్ అదే.. దాని గురించి రేయిపగలు ఆలోచిస్తున్నాయి. ఎంత అనుకుంటే ఏం లాభం.. క్షేత్రస్థాయిలో అధికారులు , కాంట్రాక్టు పొందిన అధికారుల మొద్దునిద్రతో ఆ పనులు పూర్తికావడం లేదు. అందుకే చంద్రబాబు చండ్రనిప్పులు కురిపించాడు. మీ నిర్లక్ష్యానికి మూల్యంతప్పదని.. మీకు తగిన గుణపాఠం చెబుతామని కాంట్రాక్టు సంస్థలను, అధికారులను హెచ్చరించారు. కొంపదీసి కాంట్రాక్టును రద్దు చేసి వేరేవారికి అప్పగిస్తారా అన్న సందేహాలు అంతటా నెలకొన్నాయి.
పోలవరం నిర్మాణంలో భాగం గా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు చేపట్టిన బావర్ కంపెనీ ప్రతినిధులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతివారం లక్ష్యం విధించినా 40శాతం పనులు పూర్తి చేయడం లేదని.. ఇలాగైనే నిర్మాణ బాధ్యతలను అంతర్జాతీయ సంస్థలకు అప్పగిస్తానని హెచ్చరించారు. అమరావతిలో నిర్వహించిన పోలవరం ప్రాజెక్టు సమీక్షలో బాబు అధికారులు, కాంట్రాక్టర్ల తీరును తప్పుపట్టారు.
2019 ఎన్నికల నాటికి పోలవరం పూర్తిచేసి అపరభగీరథుడిలా ప్రజల ముందుకు వెళ్లాలని చంద్రబాబు ఎంతో ఆశపడుతున్నారు. అందుకే నెలలో రెండుసార్లు పోలవరంపై సమీక్షిస్తున్నారు. అక్కడిపోయిన తెలుసుకుంటున్నారు. చంద్రబాబు మానసపుత్రిక అయిన ఈ పథకంపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలు నిర్లక్ష్యం వహిస్తుండడం చంద్రబాబుకు మింగుడుపడడం లేదు. పాలనలో పరుగులు పెట్టించే బాబు.. ఉన్నా ఆయనతో పరుగెట్టలేని అధికారులతో వేగలోకపోతున్నారు.

To Top

Send this to a friend