గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడానికి లేదు..


ఇప్పుడు పెళ్లిళ్లు చాలా ఖరీదు అయ్యాయి. విందు, వినోదాలు.. మందు, అతిథులు.. కనీసం 50 రకాల వంటకాలు.. అబ్బో ఒకటేమిటీ.. ఈరోజుల్లో ఖరీదైన ఫంక్షన్ హాళ్లు.. హోటల్లలో అదిరిపోయేలా పెళ్లి చేసుకుంటున్నారు .. పెళ్లిల్ల కోసమే బడాబాబులు కోట్లు ఖర్చుపెడుతున్నారు. కానీ ఇకపై ఇలాంటి హంగామాలు.. కోట్లు తగలేయడాలు కుదరదిక..
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆర్భాట పెళ్లిలపై కఠిన నిబంధనలతో అడ్డుకట్ట వేసింది.. మరికొన్ని రాష్ట్రాలు కూడా జమ్మూ బాటలో నడిచేందుకు నిర్ణయించాయట.. జమ్మూలో ఇకపై పెళ్లిల్లు జరిగితే దానికి వచ్చే అతిథులు పరిమితంగానే హాజరు అవ్వాలట.. అమ్మాయి పెళ్లిచేసేవారు గరిష్టంగా 500మందిని.. అబ్బాయి పెళ్లి చేసేవారు 400మందినే ఆహ్వానించాలని జమ్మూ ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఇక నిశ్చితార్థం వంటి చిన్నపాటి శుభకార్యాలకు 100 మంది అతిథులను మాత్రమే పిలవాలనే కండీషన్ పెట్టింది. అంతేకాదు లౌడ్ స్పీకర్లు.. బాణాసంచా.. ఆహ్వానపత్రికలో స్వీట్లు, డ్రైఫ్రూట్స్, వంటివి.. పెళ్లిల్లలో సంగీత్ వంటి హంగు అర్భాటాలపై నిషేధం విధించింది.. రాష్ట్రంలోని వనరులు ఇలా భారీ పెళ్లిళ్లలో దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. పెళ్ళి ఖర్చుకు సంబంధించి లోక్ సభలో ఇదే తరహా బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కేంద్రం ఆలోచిస్తున్న సందర్భంలో ఇలా కాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

To Top

Send this to a friend